Family survey enumerators : సర్వే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి
--నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సర్వే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, నల్లగొండ: సమగ్ర కుటుంబ సర్వేకై ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు (For enum erators) ప్రజలు సహకరించా లని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ప్రారం భమైన సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను నల్గొండ ( nalgonda) మున్సిపా లిటీ పరి ధిలోని బి టి ఎస్ కాలనీ లో ఆమె తనిఖీ చేశారు. మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ ఇంటింటి సర్వే (Household survey) సందర్భంగా సేక రించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికీ సమాచా రాన్ని వెల్లడి చేయడం జరగదని, అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేట ర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ( state govern ment) సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ,కులసమగ్ర ఇం టింటి కుటుంబ సర్వేకు చాలా ప్రా ధాన్యత ఇస్తున్నదని, అందు వలన తప్పు సమాచారం (Wrong info rmation) ఇవ్వకుం డా సరైన స మాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం ఉపయో గపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్యు మరే టర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ,ఈనెల 6 నుండి 8 వరకు ఇండ్లను సంద ర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జ రుగుతుందని, అనంత రం సర్వేకు ప్రభుత్వం రూపొందించిన సు మారు 75 కాలంలలో వివరాల సేకరణ చేపట్టడం జరు గుతుం దని చెప్పారు. ప్రజలు ఆధా ర్ కార్డు, రేషన్ కార్డు, ధరణి ( dha rani) పట్టాదారు పాస్ బుక్ వం టివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యు మరే టర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాల ని పునరుద్ఘాటించారు.
సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితు లలో తప్పులు నింప వద్దని, ఏవై నా సందేహాలు ఉంటే సూ పర్వైజ ర్లు, లేదా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో ( mpdo) లను సంప్రదించి నివృత్తి చేసుకో వాలన్నారు. ఇండ్ల జాబితా తయారీ సందర్బంగా ఇంటిని సందర్శిం చినట్లుగా స్టిక్కర్ ( sticker) అతికించాలని చెప్పా రు. సర్వే ఫారం లో పూర్తి వివరా లను నింపాలని, ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటా ను ఆన్లై న్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అందరు ము న్సి పల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సమగ్ర సర్వే విషయంపై విస్తృతంగా టామ్ టామ్ వేయించాలని ఆదేశాలు జారీ చేశారు.
సమగ్ర సర్వేకు వివరాలు ఇచ్చేందుకు ప్రజలు భయపడాల్సిన అవ సరం లేదని అన్నారు. మూడు స్థాయిల్లో సర్వేను పర్య వేక్షించడం జరుగుతుందని, ఇందుకు సూపర్వైజర్లు, మండల ప్రత్యేక అధికారి లేదా మున్సి పల్ కమిషనర్ , జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ నోడ ల్ అధికారిగా నియమించడం జరిగిందని, అంతేకాక ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్, ఆకస్మికతనిఖీల ద్వారా కార్యక్ర మాన్ని పర్యవేక్షి స్తున్నట్లు ఆమె తెలిపారు. నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సి పల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఎన్యుమరేటర్లు తదితరులు ఉన్నారు.
Family survey enumerators