Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmer insurance: రైతు భ‌రోసా అమ‌లుపై దృఢ సంక‌ల్పం

–వ్య‌వ‌సాయ రంగాన్ని కాపాడుకుం దాం
–అన్న‌దాత‌లను ఆదుకోవ‌డ‌మే ప్రధాన ధ్యేయం
–ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ‌, రైతుల సూచ‌న‌ల‌పై అసెంబ్లీలో చర్చిస్తాం –ఖ‌మ్మంలో రైతు భ‌రోసా ప్ర‌జాభిప్రా య‌సేక‌ర‌ణలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌ రావు

Farmer insurance: ప్రజా దీవెన, ఖ‌మ్మం: రైతుల ఆలో చ‌న‌, మనోగతంతోనే రైతు భ‌రోసా (Farmer insurance) విధివిధానాలు రూపొందిస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka)అన్నారు. తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ రంగాన్ని కాపాడుకుందా మ‌ని, అందులో భాగంగా పెట్టుబ‌డి అంద‌జేయడం కోసం రైతు భ‌రోసా అమ‌లు చేయ‌డానికి త‌మ ప్ర‌భుత్వం దృఢ సంక‌ల్పంతో ముంద‌డుగు వేస్తోంద‌ని చెప్పారు. ఖ‌మ్మం క‌లె క్ట‌రేట్‌లో నిర్వ‌ హించిన రైతు భ‌రోసా ప‌థ‌కం ప్ర‌జాభిప్రాయ‌ సేక‌ర‌ ణ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగు లేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, త‌మ్మ‌ల నాగేశ్వ‌ ర‌రావులతో కలిసి పాల్గొన్నారు. రైతుభరోసాపై విధివిధానాల ఖరా రు కోసం రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న ట్లు వెల్లడించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వం ఏ స్కీమ్‌ చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలే దన్నారు.

నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దార న్నారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతీపై సా ప్రజల నుంచి వచ్చిందేనని, రైతులు ఇచ్చే సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుం టామన్నారు. మంత్రి తుమ్మల నాగే శ్వర్ రావు(Minister Tummala Nage Swar Rao) మాట్లాడుతూ రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం ముం దుకెళ్తుందన్నారు. రైతుల అభిప్రా యం తీసుకున్నాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు.రైతాంగాన్ని ఆదుకోవ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని అన్నారు. రైతు భరోసా అమలుపై తెలంగాణ సర్కా ర్ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తోంది. అం దులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందం ప‌ర్య‌ టించి ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని సేక‌రిం చింది. జిల్లాల పర్యటన ముగిసిన తరువాత ప్ర‌భుత్వం తుది నిర్ణయం తీసుకుంటోంది. 11న అదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి(మెదక్), 18న నిజామాబాద్, 19న కరీం నగర్, 22న నల్గొండ, 23న రంగా రెడ్డి కలెక్టర్ కార్యాలయాల్లో రైతుల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించ నున్నట్లు షెడ్యూల్‎ను (Schedule) రూపొందించ మన్నారు.