Farmer loan waiver : అన్నట్లు ఆగస్టులో రుణమాఫీ చేస్తే బిఆర్ఎస్ ను రద్దు చేస్తారా
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి, బావోజీ, సేవాలాల్ ల సాక్షిగా ప్రమాణం చేసి అన్నట్లుగా పంద్రాగస్టు లోపు రుణ మాఫీ చేస్తే బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతూ సవాల్ విసిరారు.
బావోజీ, సేవాలాల్ సాక్షిగా పంద్రా గస్టులోగా రుణమాఫీ
వంద రోజుల్లో అయిదు గ్యారెంటీ లను అమలు చేసి చూపించాం
రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్‌తో సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను
ఈ 4 నెలల్లో రూ.26 వేల కోట్ల వడ్డీలే వడివడిగా చెల్లించాo
ప్రజల్ని మోసం చేసినందుకు కేసీ ఆర్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలి
మతాల పేరుతో అన్నదమ్ముల లాంటి ప్రజల మధ్య బీజేపీ చిచ్చు
కొడంగల్ సభలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగ్ర రూపం
ప్రజా దీవెన, మహబూబ్ నగర్ : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి, బావోజీ, సేవాలాల్ ల సాక్షిగా ప్రమాణం చేసి అన్నట్లుగా పంద్రాగస్టు లోపు రుణ మాఫీ చేస్తే బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Enumula Revanth Reddy) తీవ్రస్థాయిలో మండిపడుతూ సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ పై బీఆర్‌ఎస్ నేతలు విసురుతున్న సవాళ్లకు ఆయన నేరుగా ప్రతి సవాల్ చేశారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనా మా చేయాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తనకు సవాల్ విసిరా రని, అటు సూర్యుడు ఇటు పొడి చినా రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు.
లంబాడ గిరిజనుల ఆరా ధ్య దైవాలైన బావోజీ, సేవాలాల్‌ల సాక్షిగా, అంతకుముందు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narsimha Swamy) సాక్షిగా ఆగస్టు 15లోగా అది జరుగుతుం దని పునరుద్ఘాటించారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీశ్ రావు తన మామ కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో నిర్వహించి న కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమా వేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిం చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీ ఆర్‌ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
తాము వంద రోజు ల్లో ఆరు గ్యారెంటీలకు గాను ఐదు గ్యారెంటీలు అమలు చేసి చూపిం చామని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) పదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలే దని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి ఇలా ఏ హామీనీ కేసీఆర్ అమలు చేయలేదన్నారు. రెండు సార్లు చేసిన రుణ మాఫీ మిత్తికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు ఏ హామీ అమలు చేయని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంద న్నారు.
తాగుబోతు అప్పుల సంసారంలాగా రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్‌ను తనకు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అప్ప గించారని, బాధ్యతగా వ్యవహరి స్తూ నాలుగు నెలల్లో రూ. 26 వేల కోట్ల కిస్తీలు, మిత్తి చెల్లించానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతీ నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగుల కు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి రూ.1369 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని వివరించారు.
రూ.500లకు సిలిండర్ పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నా మని, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు(Free electricity) పథకం కింద 44 లక్షల ఇళ్లలో వెలుగులు నింపుతున్నా మని సీఎం తెలిపారు. గత ప్రభు త్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకపోతే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లు కేటాయిం చి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకపోతే తమ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశా మని చెప్పారు.
బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయవద్దు… రైతుల రుణాల వసూళ్ల కోసం డీసీసీబీ తదితర బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తు న్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏ అధికారి ఒత్తిడి చేసినా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులు(Farmers) బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు, మిత్తి నయా పైసలతో సహా చెల్లించే బా ధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్ప ష్టం చేశారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రూ.500 బోనస్‌గా ఇ చ్చి మరీ ప్రతీ గింజను కొంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ పదేళ్లలో చేసిందేమీ లేక రోడ్డెక్కి గోడల మీద పోస్టర్లు వేస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి కానీ, రెచ్చగొట్టే విధంగా ఉండకూడదన్నారు. హిందూయిజంలోనే పరమత సహనం ఉన్నదని, పీర్ల పండుగ హిందువులే ఎక్కువ చేసుకుంటా రని, రంజాన్ దావత్‌లకు పోతరని, హిందువుల పండుగలకు ముస్లిం లు వస్తారని, క్రిస్మస్‌కు క్రైస్తవుల ఇండ్లకు హిందూ ముస్లింలు వెళ్లి కేకులు తింటారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
అన్మదమ్ముల్లా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెడుతుంటే మోసపోవద్దని హితవు పలికారు. డీకే అరుణ మోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులోనే పొడిచేందుకు యత్నిస్తున్నారని గద్వాలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థి కి డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన ఆమె మీద ముఖ్యమంత్రినైనా తనకు అసూయ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Farmer loan waiver in august