Farmer Suscide : ప్రజా దీవెన, హైదరాబాద్: అన్న దాతలు అరిగోస పడుతున్నారు. అంతర్గత ఒత్తిడితో అయోమయ పరిస్థితులను అధిగమించలేక అసువులుబాస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అకడక్కడా అ ప్పుల బాధతో నలుగురు అన్న దా తల బలవర్మరణానికి పాల్పడ్డట్టు గణాంకాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభా న్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. వర్షా భావ పరిస్థితులు ఓ వైపు, తగిన మద్దతుధర, పంటలకు సకాలంలో పెట్టుబడులు కరవు కావడం మరో వైపు వెరసి అన్నదాతల జీవితాల ను ప్రభావితం చేస్తునడంలో అతి శయోక్తి లేదు. ఏదేమైనా తాజా సా గు పరిస్థితి సమస్యల వలయంలో చిక్కుకుందని చెప్పకనే చెప్పవ చ్చు. ఈ వరుస సమస్యలు రైతు లను రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టే స్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితు లకు యాదాద్రి భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్ర య్య పత్తి సాగులో ప్రతికూల వా తావరణం ఎదురుకావడంతో తీవ్రంగా నష్టపోయారు. అప్పులు పెరిగిపోవడంతో మానసికాoదోళ నకు గురై విధిలేని పరిస్థితుల్లో చివ రికి పురుగుమందు ఆత్మార్పణకు పాల్పడ్డాడు.
అదే విధంగా సిరిసిల్ల జిల్లా పోతుగల్లోకి చెందిన దేవయ్య వరి పంట నీటి ఎద్దడితో పంట ఎం డిపోవడంతో ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఇక భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రాజు అనే రైతు, మహబూబాబాద్ జిల్లా వేముల పల్లిలో వెంకన్న అనే రైతు కూడా ఇ లాంటి పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కోలేక తీవ్రంగా అప్పుల ఊ బిలో కూరుకుపోయారు. ఊహిం చని విధంగా వరుస నష్టాల బా రి న పడటంతో అప్పులను ఎలా తీ ర్చాలో అర్థం కాక తాము మిగిల్చిన కుటుంబసభ్యులు ఎలా బతుకుతా రనే ఆందోళనతో చేతులారా ప్రాణా లు బలి పెట్టారు. వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఖర్చులు అధికమై భారంగా మారుతుండటం, తక్కువ దిగుబడి రావడం రైతులను మరిం త భారానికి గురిచేస్తోన్న క్రమంలో వరుసగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తూ ప్రతిపక్షాలకు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వా న్ని టార్గెట్ చేస్తూ రైతులకు తగిన మద్దతు లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నాయి. రైతుల పరిస్థితి ని గమనించి అప్పుల మాఫీ, సబ్సి డీలు, సాగునీటి సదుపాయాలు క ల్పించాలనే డిమాండ్ పెరుగుతోం ది. వరుసగా రైతుల ఆత్మహ త్య లు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే పరి స్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉదన్న సంకేతాలు వెలు వడుతున్నాయి. రైతులకు ఉజ్జీవ నంలాంటి విధానాలు అమలు చే యకపోతే, వ్యవసాయరంగం మ రింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతల అరిగో స లు సమాజానికి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.