Farmer’s Assurance: ప్రజా దీవెన, పాలకవీడు: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు భరోసా కింద ఖరీఫ్ సీజన్లో మొదటి విడత రూ. 7500 రైతుల ఖాతాలో జమ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో మండల నాయకులతో కలిసి విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చి 8 నెలలవుతు న్న విధివిధానాల పేరిట రైతుల ఖాతాలో జమ చేయాల్సిన రైతు భరోసా డబ్బులను జాప్యం చేయడం అన్యాయమన్నారు. 10 ఎక రాల లోపు రైతులందరికీ రైతు భరో సా అమలు చేయాలని అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు వివిధ ప్రజా ప్రతినిధు లుగా వ్యవహరిస్తున్న వారికి రైతు భరోసా వర్తింప చేయొద్దని ఆయన కోరారు అంతే కాకుండా రుణమాఫీ (Loan waiver)విషయంలో 2018 కంటే ముందు అప్పు తీసుకున్న రైతులు రెన్యువ ల్ చేయించుకున్న వారందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఖరీఫ్ సీజన్ మొదలైందిన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు వెసు లుబాటుగా వెంటనే రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమా వేశంలో సిపిఎం పార్టీ ఎక్స్ జెడ్పి టిసి నరసింహ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, రైతు సంఘ నాయకులు వడ్డే సైదయ్య, మండల నాయకులు గుర్రం ధనముర్తి, పురుషోత్తం రెడ్డి ఏసురత్నం, మల్లారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.