రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రైతు ఖాతాలలో జమ చేయకపోవడం బాధాకరం :ప్రసాద్.
Farmer’s Bonus Money : ప్రజా దీవెన, కోదాడ: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, సామినేని నరసింహారావు బాబు,మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.