Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burning paddy sticks: పంట పేరుతో వంటికి మంట…. కొయ్యల దహనంతో రైతుకు కొరివి

పంట చేతికి వచ్చిన తర్వాత కొయ్యల దహనం పేరుతో రైతులు పెడుతు న్న మంటలు దుష్పరిణామాలకు దారి తీస్తున్నాయి. రైతు పంటకు పెట్టిన మంట ఒంటికి అంటుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అసహజ పద్ధతి తెలంగాణలో రోజు రోజుకు శృతి మించిపోతుంది.

అనివార్యంగా రాష్ట్రానికి పాకిన పంట వ్యర్థాల దహనం
అసహజ ఈపద్ధతిలో భూమిలో సూక్ష్మజీవులు నాశనమవుతున్న వైనం
పంజాబ్‌, హరియాణా రైతుల వల్ల దేశ రాజధాని డిల్లీలోపొగకాలుష్యం
ఎండిన కొయ్యలు దహన ప్రయ త్నంలో ఇద్దరు రైతులు అగ్నికి ఆ హుతి
దహన పద్ధతులకు స్వస్తి ఫలకాల ని హితవు పలుకుతున్న ప్రభుత్వం

ప్రజా దీవెన, హైదరాబాద్: పంట చేతికి వచ్చిన తర్వాత కొయ్యల(Burning paddy sticks)దహనం పేరుతో రైతులు పెడుతు న్న మంటలు దుష్పరిణామాలకు దారి తీస్తున్నాయి. రైతు పంటకు పెట్టిన మంట ఒంటికి అంటుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అసహజ పద్ధతి తెలంగాణలో(Telangana) రోజు రోజుకు శృతి మించిపోతుంది. పంట కోసిన తర్వాత మిగిలిన కొయ్యల దహనం పేరుతో పెడు తున్న మంటలు రైతుకే కొరివి పెట్టే పరిస్థితిలకు దారితీస్తున్నాయి.

ఎక్కడో అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా రూపొందిం చు కున్న కొయ్యల దహనం సంస్కృతి ని అనివార్యంగా తెలంగాణ ప్రాంతా నికి తెచ్చుకొని ప్రమాదాలను నెత్తిన పెట్టుకున్న పరిస్థితులు ఉత్పన్నమ య్యాయి. అసహజమైన ఈ పద్ధతితో బంగారం లాంటి తెలంగాణ భూముల్లో సూక్ష్మజీ వులు సర్వనాశనం అవుతుండ డంతో వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని పంజాబ్‌, హరియాణా రైతుల అవ లంబించే కొయ్యల దహనం పద్ధ తుల ద్వారా దేశ రాజధాని డిల్లీని పట్టిపీడిస్తున్న పొగకాలుష్యం(Air pollutions) కు కారణభూతమైంది.

ఈ క్రమంలోనే అనువార్యంగా మన రైతులు తెచ్చి పెట్టుకున్న ఈ పద్ధతి ద్వారా ఎండి న కొయ్యల దహన ప్రయత్నంలో తెలంగాణలో ఇద్దరు రైతులు అగ్నికి ఆహుతైన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఎండిన కొయ్యలు దహనం చేయబోయి ఈ నెలలోనే ఇద్దరు రైతులు అగ్నికి ఆహుత య్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ అసహజమైన దహనం(Burning)చేయొద్దంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటన జారీ చేశారు. అధికా రులు గమనిస్తూ ఉండాలని ఆదేశించినా చాలామంది రైతులు మార్గంలో సహజంగానే ప్రయాణిస్తు న్నారు.

ఈ నెల 9న వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.

ఈ నెల మూడో తేదీన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్గోట్‌లో కిషన్‌ వరి కొయ్యలకు నిప్పంటించాడు. 45 డిగ్రీలకు పైగా ఎండ, కొయ్యలు ఎండి ఉండడంతో మంటలు ఎగశాయి. కిషన్‌ వాటిని తప్పించుకోలేక సజీవ దహనమయ్యారు.

రాష్ట్రంలో కొన్నేళ్ల కిందటి వరకు వరి కోతలను మనుషులే కోసేవా రు. ఇప్పుడు హార్వెస్టర్లను వాడు తున్నారు. కొద్ది రోజులకు కొయ్య కాళ్లను దహనం చేస్తున్నారు. కాగా, పంట వ్యర్థాల దహనం విధానం.. సాగులో యంత్రాలను బాగా విని యోగించే పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉంటుంది. అక్కడ కొయ్యలు అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తులో మిగులుతాయి. వీటిని తొలగించడంలో కూలీ ఖర్చు లకు తోడు సమయం పడుతుంది. దీంతోనే నిప్పు పెడుతుంటారు.

ఈ మంటల పొగ ఢిల్లీకి కూడా వ్యాపిం చి కాలుష్య సమస్య సృష్టిస్తోంది. కొయ్యలకు నిప్పంటించే క్రమంలో రైతులు చనిపోవడంతో పాటు పక్క చేలు కూడా కాలిపోతున్నాయి. పొగతో వాతావరణం కలుషితం అవుతోంది. మంటల తీవ్రతకు నేల గట్టిపడి దెబ్బతింటోంది. కాగా, గడ్డి, భూమిలో చాలా పోషకాలు ఉంటా యని, కొయ్యల దహనంతో అవన్నీ కోల్పోతామని వ్యవసాయ నిపుణు లు జీవీ రామాంజనేయులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో హార్వెస్టర్‌ వదిలిన కొయ్యలను తొలగించాలంటే ఎకరానికి 10 నుంచి 12 మంది కూలీలు కావాలి.

దీనికంటే పంట వ్యర్థాల దహనం మేలని రైతులు భావిస్తున్నారు. కొయ్యలను భూమిలో కలిపేస్తే పంటకు ఎరువుగా ఉపయోగప డతాయి. యూరియా వినియోగం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబు తున్నారు. కానీ, రైతులు రిస్క్‌ తీసుకోవడం లేదు. కాగా, ‘చిప్పర్లు’ అనే యంత్రాలతో వరి కొయ్యలను చిన్నగా కట్‌ చేయొచ్చని తెలి పారు. పీఏసీఎస్‌లు, ఎఫ్‌పీ వోల ద్వారా వీటిని రైతులకు అందిం చాలని సూచిస్తున్నారు. యాసం గిలో పెసర్లు, మినుములు, పప్పు ధాన్యాలు, వేరుశనగ, నువ్వులు తదితర నూనె గింజలు సాగుచేస్తే వానాకాలంలో వరి సాగుకు సమ యం సరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు పేర్కొంటున్నారు.

 

Farmers burnt wastage of paddy