Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmers: పద్నాలుగు పంటలకు మరింత మద్దతు

–కేంద్ర క్యాబినెట్‌ సమావేశం లో వరి, పత్తి, మరిన్నింటిపై నిర్ణయం
–మహారాష్ట్రలోని వధావన్‌లో రూ. 72,600 కోట్లతో అతి పెద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ఆమోదo
–భారీగా తీరప్రాంత పవనశక్తి ప్రాజె క్టుల అమలుకు వీజీఎఫ్‌ పథకం
–ఫోరెన్సిక్‌ ఇన్‌ఫ్రా విస్తరణకు సైతం రూ.2,254 కోట్లతో అనుమతి

Farmers: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అన్నదాతలకు అండగా నిలుస్తామని అన్నట్లుగానే ఎన్డీఏ (NDA) ప్రభుత్వం ఆచరించి చూపించింది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సంకీర్ణ సర్కారు రైతులకు తీపి కబురు అందించింది. ప్రధాని నరేం ద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన తొలి క్యాబినెట్‌ సమావేశం (First Cabinet meeting) వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తితో పాటు మొత్తంగా 14 పంటలకు కనీ స మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసు కుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతులకు (FARMERS) ప్రాధాన్యం ఇస్తారని అందుకే మూ డోసారి ఎన్నికయ్యాక ఆయన తీసు కున్న తొలి నిర్ణయం కూడా రైతుల కోసమేనని పేర్కొన్నారు.

కనీస మ ద్దతుధర అనేది ఉత్పత్తి ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఉండాలంటూ 20 18 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్ట మైన విధాన నిర్ణయాన్ని తీసుకుం దని ఆయన గుర్తుచేశారు. బుధవారం క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం అందుకు అనుగుణంగానే ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాలు, తాలూకాల్లో ‘కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రై సెస్‌’ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఉత్పత్తి ఖర్చును శాస్త్రీ యంగా లెక్కించినట్టు మంత్రి వివరించారు. తాజాగా ప్రకటించిన మ ద్దతు ధరల్లో వరికి గతేడాదితో పోలి స్తే రూ.117 పెరిగింది. కనీస మద్ద తు ధరలను పెంచుతూ కేంద్రం తీ సుకున్న ఈ నిర్ణయంతో రైతులు గతేడాదితో పోలిస్తే రూ.35 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి పొందు తారని అంచనా వేసింది కేంద్ర ప్రభు త్వం. ఆయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశ వ్యాప్తంగా రైతులు (FARMERS) డిమాండ్‌ చేస్తు న్న విషయం విదితమే. ఆ డిమాండ్ల (DEMANDS)తో పాటు హరియానా, మహారా ష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది ఎన్నికలు జరగను న్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర లను పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుందని సమాచారం. కేంద్ర మంత్రి మండలి (Union Council of Ministers) తీసుకున్న మరి కొన్ని కీలక నిర్ణయాలు ఇలా ఉన్నా యి.

–మహారాష్ట్రలోని వధావన్‌లో రూ.76,200 కోట్లతో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ఆమోదం. నిర్మా ణం పూర్తయితే ప్రపంచంలోని టాప్‌ –10 పోర్టుల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అంచనా.
–తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,453 కోట్లతో వ యబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీ ఎఫ్‌) స్కీమ్‌ అమలుకు పచ్చజెండా. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో 500 మెగావాట్ల చొ ప్పున నిర్మించే ఒక గిగావాట్‌ పవ నశక్తి కేంద్రాల నిర్మాణానికి అయ్యే రూ.6,853 కోట్లు ఈ పథకం ద్వారా నే ఖర్చుపెట్టనున్నారు.
–రూ.2,870 కోట్లతో వారాణసీ నగ రంలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయ అభి వృద్ధి ప్రతిపాదనలకు అంగీకార ముద్ర. ఆ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణంతోపాటు, రన్‌వేను విస్తరణకు చేసిన ప్రతి పాదనలను క్యాబినెట్‌ ఆమోదిం చింది.
–రూ.2,254 కోట్ల ఖర్చుతో 20 24–2029 నడుమ దేశ వ్యాప్తంగా ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఫోరెన్సిక్‌ ల్యాబుల ఏర్పాటు, ఢిల్లీలో ఉన్న నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూని వర్సిటీకి దేశవ్యాప్తంగా కొత్త క్యాం పస్‌ల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.