Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fatal road accident in Nalgonda district:నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

-- నసర్లపల్లి వద్ద దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం -- తీవ్రంగా గాయపడిన మరో ముగ్గరి పరిస్థితి విషమం

బిగ్ బ్రేకింగ్…

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– నసర్లపల్లి వద్ద దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం

— తీవ్రంగా గాయపడిన మరో ముగ్గరి పరిస్థితి విషమం

ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం(Fatal road accident at Nasarlapalli, Chintapalli Mandal, Devarakonda Constituency, Nalgonda District) లో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

నసర్లపల్లి వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పిన కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత( three people died on the spot when the car collided with the two-wheeler)  పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన మహిళతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చింతపల్లి పోలీసులు తెలిపారు.

అయితే ఈ ప్రమాదంలో  ద్విచక్రవాహనంపై హైదరాబాదు నుండి స్వగ్రామమైన అక్కంపల్లి గ్రామానికి బైక్ పై వస్తున్న భార్యాభర్తలు మరియు వారి కొడుకు ఉండగా అందులో తండ్రి మద్దిమడుగు ప్రసాద్(38) కొడుకు అవినాష్(12) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు.

కారులో చింతపల్లి మండలం కుర్రంపల్లి నుండి కొండమల్లేపల్లిలోని ఓ పాఠశాలలో సర్టిఫికెట్ల కోసం వచ్చి తిరిగి నలుగురు స్నేహతులతో కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణస్తున్న వారిలో తీవ్ర గాయాలయిన వారిలో పట్నపు మణిపాల్ (18) వనం మల్లికార్జున్ (12), మద్దిమడుగు రమణ (35)లు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా( Devarakonda died while undergoing treatment at the Government Hospital) మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.