Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ఫాదర్ సిల్వియో పాస్కాలి శత వర్ధంతి వేడుకలు..

కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యా నిలయం నందు పునీత అన్నమ్మ వేద బోధక సభ సంస్థాపకులు దైవ సేవకులు సిల్వియో పాస్కాలి శత వర్ధంతి వేడుకలను పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ ఆన్ జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ప్రజా దీవెన: కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యా నిలయం నందు పునీత అన్నమ్మ వేద బోధక సభ సంస్థాపకులు దైవ సేవకులు సిల్వియో పాస్కాలి(Father Silvio Pasquali) శత వర్ధంతి వేడుకలను పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ ఆన్ జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కాల్జినల్ పూల ఆంథోని, బిషప్ సగిలి ప్రకాష్ పాల్గొని బలిపూజను సమర్పించారు..

ఈ కార్యక్రమానికి సెయింట్ ఆన్స్ మదర్ జనరల్ జపమాల వట్టి , అసిస్టెంట్ మదర్ జనరల్ సిస్టర్ అల్ఫోన్స్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్కాలి చేసిన సేవను పేదల ఎడల ఆయన చూపిన ప్రేమ వారు కొనియాడారు .

Father Silvio Pasquali century celebration

ఈ కార్యక్రమంలో సిల్వియో పాస్కాలి (Father Silvio Pasquali) చేసిన సేవను డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఫాదర్ సిల్వియో పాస్కారి గారి సేవను కీర్తిస్తూ(Saint Joseph) సెయింట్ జోసఫ్ సిసిరెడ్డి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన ఎంతో గాను ఆకట్టుకున్నాయి . పాస్కాలి మఠాన్ని స్థాపించడంలో ఆయన చేసిన కృషి త్యాగం భక్తి విశ్వాసం గురించి ఎంతో వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఆన్ జ్యోతి పాఠశాల ఉపాధ్యాయులు, 100 మంది గురువులు, 200 మంది సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Father Silvio Pasquali century celebration