Female Aghori : ప్రజా దీవెన, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ని దర్గాను కూల్చివేస్తామన్న అ ఘోరి, తన శపథం నెరవేర్చుకో వడంలో విఫలమైంది, ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని, తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో పోలీసులు ఆపివేశారు. తను కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహి ళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు.
దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసు లు అప్రమత్తమయ్యారు. వేముల వాడ పట్టణానికి నలువైపులా పోలీ సులు మోహరించారు.పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అ ఘోరీ వ్యవహారం, రోజురోజుకు మితిమీరి పోతుంది, రోజు ఏదో ఒక ఊరికి వెళ్లడం స్థానికులతో గొడవ పడడం గ్రామస్తుల తో వాగ్వాదం పెట్టుకోవడం రచ్చ రచ్చ చేయడంతో అఘోరి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు లను కోరుతున్నారు.
Aghori arrested at rajannasiricilla pic.twitter.com/QlPRNMBw5A
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 4, 2025