Final Judgment : ప్రజా దీవెన, నల్లగొండ: కన్న కూతు రు పై అత్యాచారం చేసిన కసాయి తండ్రికి అత్యాచారం మరియు పో క్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్ రావు తగిన శిక్ష విధించారు. ఈ కేసులో U/s 376(2), (f)(i), 376(3) IPC & Sec 5(n) r/w 6 Of POCSO Act-2012 ప్రకారం 20 సంవత్సరాల జైలు, రూ. పది వేల జరిమానా విధించారని నల్ల గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. 2023 డిసెం బర్ 14వ తేదీన నిందితుడు కట్టంగూర్ మం డలం మునుకుంట్ల గ్రామానికి చెం దిన అక్కెనపల్లి ఆంజనేయులు 6 వ తరగతి చదువుతున్న తన సొం త కుమార్తెను ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అత్యాచారం చేసి ఎ వ్వరికీ చెప్పవద్దని బెదిరించాడు. తన తల్లి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి గమనించి అడగగా, కూతురు జరిగిన విషయం వివరిం చింది. వెంటనే తల్లి కట్టంగూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయ డంతో నిందితుడు అక్కనపల్లి ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత సమగ్ర విచారణతో సరైన ఆధారాలను కోర్టుకి సమర్పించగా నిందితుడిని న్యాయమూర్తి దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల జైలు శిక్ష మరి యు జరిమానా విధించడం జరిగిం దని తెలిపారు. సదరు కేసులో సరై న ఆధారాలు సేకరించి కోర్టులో ఛా ర్జ్ షీట్ దాఖలు చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎస్.రాఘ వరావు, సి.శ్రీనివాస రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డి.రాజు SI, ప్రస్తుత సిఐ కొండల్ రెడ్డి, ఎస్సై ఎం.రవీందర్,APP వేముల రంజి త్ కుమార్, CDO రువ్వ నాగ రాజు, M.కల్పన, లీగల్ ఆఫీసర్, బరోసా సెంటర్, నల్గొండ (Asst to Addl. PP) కోర్టు లైజైనింగ్ ఆఫీస ర్స్ పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.