*దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎర్నేని బాబు
Erneni Babu : ప్రజా దీవెన, కోదాడ : ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని బాలికల పాఠశాలలో 10 ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించిన విద్యార్థులు పొట్ల వర్షిత, షేక్ ఆషీఫా లను అభినందించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు దాతలు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.
కేవలం విద్య ద్వారానే పేదరికం జయించి సమాజంలో ఉన్నత స్థానానికి చేరు కోవాలని తెలిపారు తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న కలలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బానోతు సుశీల బాయి, ఎర్రవరం పి ఎ సి ఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరి హనుమంతరావు, వేమూరి విద్యాసాగర్, రావెళ్ల కృష్ణారావు, లైటింగ్ ప్రసాద్, ముత్తవరపు రామారావు, ఉపాధ్యాయులు పుణ్యవతి, మంగమ్మ, స్వరూప, వరలక్ష్మి, శ్రీదేవి, యామిని,నీరజ తదితరులు పాల్గొన్నారు.