*విద్యార్థుల సామాజిక స్పృహ సేవ గుణం అభినందనీయం.
*వరద బాధితులకు బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ.
Financial assistance: ప్రజా దీవెన ,కోదాడ: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక స్పృహ సేవాగుణం కలిగి ఉండటం అభినందనీయమని, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ (Pramila Ramesh), మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ (Students are teachers)బృందం వరద బాధితుల కోసం ఆర్థిక సహాయం ద్వారా మున్సిపల్ పరిధిలోని స్థానిక 13వ వార్డులో వరదలకు నష్టపోయిన బాధితులకు బియ్యం నిత్యవసర సరుకులను శుక్రవారం పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథుల చెతుల మీదుగా పంపిణీ చేశారు ఇకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి 13వ వార్డు కౌన్సిలర్ లంకేల రమా నిరంజన్ రెడ్డి (Rama Niranjan Reddy) పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి మార్కండేయ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.