Financial Assistance: ప్రజా దీవన/ కనగల్: కనగల్ మండలం, చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన కాటేపల్లి శేఖర్ ఇటీవల తాటి చెట్టు పైనుండి పడి గాయపడడంతో. పేద కుటుంబానికి చెందిన గీత కార్మికుడి సంబంధించిన వివరాలు KGKS రాష్ట్ర కార్యదర్శి కొండ వెంకన్న గారి ద్వారా తెలుసుకున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్రస్టు సభ్యులు, వేంటనే వారి కుటుంబానికి మంజూరుచేసిన రూ.10 వేల ఆర్థికసాయాన్ని, KANA స్థానిక వాలంటీర్లు బల్గూరి వెంకన్న గౌడ్ , KGKS రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకన్న చేతులమీదుగా బాధితుడు కాటేపల్లి శేఖర్ ను పరామర్శించి అందజేశారు. తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు, మరియు చెట్లచెన్నారం గీత కార్మిక సంఘం సభ్యులు అభినందనలు , కృతజ్ఞతలు తెలియజేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.