ప్రజా దీవెన, కోదాడ:తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఇటీవల పట్టణంలోని 22 వార్డులో ప్రమాదవశాత్తు రెండు ఇళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో స్థానికులు ఇచ్చిన సమాచారానికి వెంటనే స్పందించి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చాకచక్యంగా వ్యవహరించి నష్టం జరగకుండా బాధితులకు అండగా నిలుస్తున్నారని వారి సేవలు అని అన్నారు.
అదేవిధంగా ఇటీవల వచ్చిన వరదల్లో చిక్కుకున్న ఎంతోమందిని కాపాడినందునారు వారి సేవలు గుర్తించి శుక్రవారం బాలాజీ నగర్ లోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో అగ్నిమాపక సిబ్బందిని నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, వీరబాబు,విజయ్ కుమార్, సురేందర్ రెడ్డి,మహేష్, వెంకటేశ్వర్లు, మట్టయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.