JEE Advanced Results: జేఈఈ జై కొట్టిన తెలంగాణ
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో(JEE Advanced Results) తెలుగు వి ద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.
అడ్వాన్స్‌డ్‌లో మొదటి 3 ర్యాంకు లు మనవే
తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకు లు తెలుగు రాష్ట్రాలకే
వీటిలో 16 మంది తెలంగాణ, ఏపీకి మరో 10 మంది
గురుకుల విద్యార్థుల కు మంచి ర్యాంకులు రావడం గమనార్హం
ప్రజా దీవెన, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో(JEE Advanced Results) తెలుగు వి ద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు. వీరిలో 16 మంది తెలంగాణ నుంచి కాగా మిగ తా 10 మంది ఏపీకి చెందిన పిల్ల లున్నారు. ఆల్ ఇండియా(All India) టాప్– 10 ర్యాంకుల్లో మూడు ర్యాంకుల ను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. హైదరాబాద్ విద్యార్థి సందేశ్ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, పుట్టి కుశాల్‌కుమార్ ఐదో ర్యాంకు, ఎస్‌ఎస్‌డీబీ సిద్థ్విక్ సుహా స్ పదో ర్యాంకుతో మెరిశారు. జేఈ ఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను(JEE Advanced Results) ఐఐటీ మద్రాస్(IIT Madras) ఆదివారం విడుదల చేసిం ది.
హైదరాబాద్‌లోని సుచిత్రకు చెందిన గంగా శ్రేయాస్‌కు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు, గచ్చిబౌలి విద్యార్థి ప్రీతం భాటియాకు 32వ ర్యాంకు, హర్షిణికి 72వ ర్యాంకు, సిద్దిపేటకు చెందిన లక్ష్మి నరసిం హారెడ్డికి 76 ర్యాంకు, శ్రేయాస్ హోహన్ కల్లూరి 92వ ర్యాంకు, నల్ల గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్ రాహుల్‌కు 207వ ర్యాంకు, ఎన్ హరిచక్రవర్తి 483వ ర్యాంకు, మిర్యా లగూడకు చెందిన కుంచం శివకు 211వ ర్యాంకు, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జే వెంకటేశ్‌కు 293వ ర్యాంకు సాధించారు. ఆసి ఫాబాద్ జిల్లా కెరిమరి మండలం అనార్‌పల్లి గ్రామానికి చెందిన రాథోడ్ అనుషుల్‌రామ్‌కు ఆల్ ఇండియా ఎస్టీ విభాగంలో 63వ ర్యాంకు వచ్చింది.
కరీంనగర్‌కు చెందిన ఎం. హర్షిత్, జీ శ్రీహాస్, బీ భరద్వాజ్, ఆర్ పునీత్ మనోహర్, సుబోధ్ చౌదరీ, శివచరణ్, పీ రాహుల్, దేవదత్త, విశాల్ రెడ్డి అనే విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో వరుసగా 64, 290, 396, 477, 545, 557, 571, 751, 838 ర్యాంకులు పొందారు. ఏపీలోని కర్నూలు విద్యార్థులు కొండూరు తేజేశ్వర్‌కు జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు, హర్షవర్ధన్‌కు 42వ ర్యాంకు, కే శివ నారాయణకు 51వ ర్యాంకు, ప్రణతికి 345వ ర్యాంకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం సింగాపురం గ్రామానికి మర్రి రోహిత్ రెడ్డికి జాతీ య స్థాయిలో 2,672వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ(Telangana Social Welfare) గౌలిదొడ్డి బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు 82 మంది పరీక్ష రాయగా వారిలో 62 మంది అర్హత సాధించారు. గౌలిదొడ్డి బాలి కల గురుకుల కళాశాల నుంచి 59 మంది పరీక్ష రాయగా 17 మంది క్వాలిఫై అయ్యారు.
రాజేంద్రనగర్ లోని గిరిజన బాలుర ఐఐటీ స్టడీ సర్కిల్‌లో(Tribal boys in IIT study circle) చదివిన 63 విద్యార్థులు అర్హత పొందారు. ఇక్కడి నుంచి జాతీయ స్థాయి ఎస్టీ కేటగిరీలో బి.చందూలాల్ 291వ ర్యాంకు, బి.బింద్రా 295వ ర్యాంకు, కె.వినోద్ 338వ ర్యాంకు, గట్టు శ్రీహర్ష 625వ ర్యాంకు, బాణోత్ తరుణ్ 625వ ర్యాంకు, వంకుదోతు సంతోష్ 812వ ర్యాంకు, డి. స్టిపెన్ 887వ ర్యాంకు, కత్రావల్ విశాల్ 930వ ర్యాంకు, భూక్య రాజ్‌కుమార్ 936వ ర్యాంకు, నేనావత్ రమేశ్ నాయక్ 936వ ర్యాంకు, అంగోత్ రాహుల్ 946వ ర్యాంకు, దనావత్ పవన్ 973వ ర్యాంకు, భూక్యా ఈశ్వర్ 1150వ ర్యాంకు, చిలు ముర్తి రాఘవేంద్ర 1617వ ర్యాంకు, వంకుదోతు భువన్ 1773వ ర్యాం కు, కె.రవి 4347వ ర్యాంకు, కీర్తన్ 5483వ ర్యాంకు సాధించారు.
బీసీ గురుకులాల్లో 49మంది పరీక్ష రాయగా ఆరుగురు ర్యాంకులు సాధించారు. ఇదిలా ఉంటే ఆల్ ఇండియా టాప్ –10లో ఐఐటీ మద్రాస్ జోన్(IIT Madras Zone) నుంచి నలుగురు విద్యార్థులు చోటు దక్కించుకు న్నారు. వీరిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులుండటం విశేషం. మద్రాస్ జోన్ నుంచి టాప్–100లో తొమ్మి ది, టాప్ –200లో 13, టాప్– 300 లో 27, టాప్ –400లో 38, టాప్ –500లో 48 విద్యార్థులున్నారు. మద్రాస్ జోన్ నుంచి మొత్తంగా 5,136 మంది విద్యార్థులు అర్హత అయ్యారు. తెలంగాణ విద్యార్థిని శ్రీనిత్య దేవరాజ్ మద్రాస్ జోన్ నుంచి మహిళల్లో టాపర్‌గా నిలిచారు. శ్రీనిత్య ఆలిండియా ఓపెన్ కోటాలో 268 ర్యాంకును సాధించారు.
First three ranks in JEE Advanced Results