–లబోదిబోమంటున్న మత్స్యకా రులు
–10 టన్నుల మేర చేపల మృతితో భారీ నష్టం
FISHES Died: ప్రజాదీవెన, చిట్కుల్: పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో (Big pond) సుమారు 10 టన్నుల చేపలు (fishes) మృతి చెందాయి. చేపల మృతికి రసాయన వ్యర్థ పదార్థాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని పలు ఫ్యాక్టరీల (Factories)నుండి వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు (Chemical waste materials) చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
చెరువు నీటి శాంపిల్స్ (Pond water samples) సేకరించి టెస్టులకు పంపించారు. చెరువు నిండా కుప్పలు, తెప్పలుగా చచ్చిపోయి తేలిన చేపల్ని చూసి మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. చేపల మృతితో సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. 2023లో గత నైరుతి రుతుపవనాల సమయంలో (During the southwest monsoon) మత్స్యశాఖ సరస్సులో 1.5 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మత్స్యశాఖ అధికారులు సరస్సును సందర్శించారు. ప్రాథమిక పరీక్ష తర్వాత, పిసిబి అధికారులు కరిగిన ఆక్సిజన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయని, ఇది చేపల మరణానికి దారితీసిందని గుర్తించారు.. అయితే ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తామని అధికారులు (officers) తెలిపారు.