Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Food Donation: తమ్మర,కోదాడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం

Food Donation: ప్రజా దీవెన, కోదాడ: మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మంగళవారం తమ్మర కోదాడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో (Under the direction of Kodada Friends) అన్నదాన (Food Donation) కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామ చెరువు తెగి ఒక్కసారిగా వరదంతా అంతర్ గంగా వాగులోకి రావడంతో అంతర్ గంగా వాగు పొంగి కూచిపూడి గ్రామమును నీరు చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలు నీటి మధ్యలో చిక్కుకునిపోయారు.

ఈ నీరు(water) అనుకోకుండా ఒక్కసారిగా వాళ్ళ ఇండ్లలోకి నీళ్ళు రావడం వలన నిత్యవసరలకు సంబంధించిన వన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో వాళ్లు తినడానికి తిండి,తాగడానికి నీరు (Food and water to drink) లేక నానా ఇబ్బందులు ఎదురు కుంటున్న సమయంలో తమ్మర,కోదాడకు చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కూచిపూడి గ్రామం వారికి అన్నదాన కార్యక్రమాన్ని (Food Donation) నిర్వహించారు.నీట మునగడంతో అన్ని రకాలుగా ఎంతో ఇబ్బందులు పడుతుంటే మనస్సు సలిచిపోయిందని అన్నారు.వారికి ఒక పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తమ్మర,కోదాడ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.