Forest Department : ప్రజా దీవెన, ఏటూరునాగారం: ఏటూరునాగారం అటవీ శాఖ ఇ న్చార్జ్ రేంజ్ అధికారిగా 2023 సంవత్సరంలో పనిచేసిన బాల రాజును శనివారం ఏటూరునా గారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కథనం మేరకు వివరాల మేరకు 2023 సంవత్సరంలో ఏటూరు నాగారం, కన్నాయిగూడెం ఇన్చార్జి రేంజ్ అధికారిగా పనిచేసిన ఎస్. బాలరాజు అనే అధికారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వెల్లడించారు.
తునికాకు కూలీల బోనస్ డబ్బులు 2 లక్షల 70 వేల రూపాయలు అవి నీతి అక్రమాలకు పాల్పడినట్లు స్థా నిక ఫారెస్ట్ అధికారులు ఏటూరు నాగారాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేయడంతో విచారణ చేపట్టి శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు తర లించినట్టు తెలిపారు. కాగా అటవీ శాఖ అధికారిగా విధులు నిర్వహి స్తున్న బాలరాజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్లో నగదు బోనస్ డబ్బులు పడడంతో వాటిని డ్రా చే యిచుకొని తన సొంతానికి వాడు కున్నాడు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునా గారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు.