Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Forest officials: అభయారణ్యంలో అటవీ శాఖ ప్రత్యేక చర్యలు

— శ్రీశైలం అభయారణ్యంలో పులు లు పెరుగుతున్నాయని అంచనాలు
–ప్రస్తుతం 72 వరకు ఉండొచ్చని అధికారుల గణాంకాలు
— పులుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు

Forest officials: ప్రజాదీవెన, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు(Forest officials) ప్రత్యేక చర్యలకు కసరత్తు ప్రారంభించారు. శ్రీశైలం పరిసరాల్లోని అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతోoదని అటవీశాఖ (Forest officials)అంచనా వేస్తుంది. అనుగుణంగా పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలకు ఉపక్రమిం చింది. తెలంగాణలో పులు ల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయార ణ్యాలు ఉన్న విషయం తెలిసిందే. అటు ఏపీలో నాగార్జున సాగర్, శ్రీశైలం (Nagarjuna Sagar, Srisailam) అభయారణ్యం దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ అభయారణ్యంలో 72 పులులు ఉండవచ్చని అటవీశాఖ అధికా రులు భావిస్తున్నారు.శ్రీశైలం, నాగా ర్జునసాగర్ అభయారణ్యంలో పు లుల సంరక్షణ కోసం పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారులు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలో పులి మనుగడ ప్రమాదపు అంచుల్లో నిలుస్తోంది. గాంభీర్యం, రాజసంకు ప్రతీకగా నిలిచే పులి జాతిని రక్షించుకునేం దుకు భారత ప్రభుత్వం గత 50 ఏళ్లకు పైగా ప్రాజెక్ట్ టైగర్‌ను చేపడు తోంది.

ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తున్నా పులుల మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండటం జం తుప్రియులు, పర్యావరణవేత్తలను ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యం లో ప్రపంచ వ్యాప్తంగా జులై 29వ తేదీ సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుం టున్నారు. పులుల సంరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యావరణ పరి రక్షణలో Environmental protection) భాగంగా పులుల సంఖ్య పెంచడంపై ఎప్పటి నుండో కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించారు. దీని ఫలితంగా గత కొంతకాలంగా నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీ యంగా పెరుగుతూ వస్తోంది. నల్ల మల అటవీ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3568 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎన్ఎస్టిఆర్ పరిధిలో పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలో పులులు తరచు కనిపిస్తున్నాయి. దీంతో అటవీ శాఖాధికారులు వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటు న్నారు. పులల సంఖ్యను(Number of tigers) కచ్చి తంగా గుర్తించేందుకు వాటి కదలి కలు తెలుసుకునేందుకు ఇన్ ప్రారె డ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నా రు. గతంలో కేవలం ఫగ్ మార్క్ ల ద్వారానే వీటిని గణించేవారు. అయితే ఇన్ ఫ్రారెడ్ కెమెరాల ద్వా రా కచ్చితంగా వీటి సంఖ్యను తెలు సుకునే అవకాశం ఉండటంతో వీటినే ఇప్పుడు ఉపయోగిస్తు న్నారు. పులిని గుర్తించి వాటికి ప్రత్యేక ఐడీని ఇస్తున్నారు.

పల్నాడు జిల్లా పరధిలో బేస్ క్యాంపులు..

పల్నాడు జిల్లా పరిధిలోని మూడు బేస్ క్యాంపులను (Three base camps) ఏర్పాటు చేశా రు. మాచర్ల, వినుకొండ, పిడుగురా ళ్లలోని బేస్ క్యాంపుల్లో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరు ప్రతిరోజూ పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ వన్య ప్రాణుల సంచారాన్ని గుర్తిస్తారు. వీటితో పాటు విజయపురి సౌత్ రేంజ్ అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చే శిరిగిరి పాడు, బటుకులపా య, వరికపూడిశెల, పసువలు రేవు బీట్లలో నిరంతరం పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా లోయపల్లి, కాకిరాల, బొల్లాపల్లి, అడిగొప్పల, వెల్ధుర్తి (Loyapalli, Kakirala, Bollapalli, Adigoppala, Veldhurthi)బీట్లలో కూడా పులులు సంచరిస్తు న్నట్లు అటవీ అధికారులు చెబుతు న్నారు.

విజయపురి సౌత్ అటవీ రేంజ్ లో ఐదు పులులున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా పులుల సంఖ్య పెరగడంతో వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేటగాళ్ల బారి నుండి వీటిని కాపాడేందుకు యాం టీ పోచింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి స్క్వాడ్ లో (Each squad) గిరిజను లను సభ్యులుగా ఉంచి వారి సా యంతో నలమల అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎవరైనా ఉచ్చులు, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే వాటి ని తొలగిస్తున్నారు. మరోవైపు నీటి కొరత రాకుండా సాసర్ పిట్ లను ఏర్పాటు చేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్ర గణనీ యంగా ఉన్నట్లు పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు తెలిపారు. పులుల సంఖ్య పెరిగితే ఆ ప్రాంతంలో ఇతర వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. జింకలు వంటి వాటిని వేటాడ టంతో వాటి సంఖ్య పెరగకుండా పర్యవరణ సమతుల్యత ఉంటుం దన్నారు. పులులకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్య క్రమాలను చేపడుతున్నట్లు ఆయన వెల్లడిస్తున్నారు.