Former CM KCR : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి శుభవార్త అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారే జీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్ రావులకు ఊరట లభించింది. మేడిగడ్డ కుం గుబాటుకు కేసీఆర్, హరీశ్ రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలప ల్లికి చెందిన నాగవెల్లి రాజలింగ మూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటీవల ఉత్త ర్వులు జారీ చేసింది. అయితే జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టివేయాలని కేసీ ఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్ర యించారు.
శుక్రవారం పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఆదేశాలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణార్హత లేకున్నా ఉత్త ర్వులు జారీ చేశారని పిటిష నర్ల తరఫు న్యాయవాదులు వాద నలు వినిపించారు. ఫిర్యాదుదారు రాజలింగమూర్తి మృతి చెందాడని హైకోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా కేసీఆర్, హరీష్ రావు భూపా లపల్లి కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలిం గమూర్తి తాజాగా హత్య కు గురైన విషయం తెలిసిందే.