Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Collectorate : నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ నిర్మాణంకు శంకుస్థాపన

— అదనపు బ్లాక్ పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda Collectorate : ప్రజా దీవెన , నల్లగొండ : రాష్ట్ర ప్ర భుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో సమీకృత జిల్లా అధికారుల కా ర్యాలయ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా లో మాత్రం గతంలో నిర్మించిన పా త భవనంలోనే జిల్లా కలెక్టర్ కార్యా లయంతో పాటు, పలు జిల్లా అధి కారుల కార్యాలయాలు కొనసాగు తున్నాయి.

ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్న సమావేశ మందిరం కేవ లం 250 సీట్ల సామర్థ్యంతో ఉన్నం దున తరచూ నిర్వహించే పెద్ద పెద్ద సమావేశాలు, సమీక్ష సమావేశా లకు ఈ హాలు సరిపోకపోవడం ,డి ఎం హెచ్ ఓ,డీ ఈ ఓ వంటి మరికొ న్ని కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కా ర్యాలయం బయట ఉండడం వల న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ లోనే 40 కోట్ల రూపాయలతో అదనపు బ్లాకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా గత నెల 28 న ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమ టి రెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు అద నపు బ్లాక్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు .అయితే బుధవా రం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవ రణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదన పు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏప్రిల్ 28 న రాష్ట్ర రోడ్లు, భవ నా లు, నీపారుదల శాఖ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టరేట్లో నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మా ణానికి శంకుస్థాపన చేయడం జరి గిందని, 40 కోట్ల రూపాయలతో 82 ,000 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో జి, ప్లస్ టు విధానంలో ఈ అదనపు బ్లాక్ నిర్మాణాన్ని చేపడు తున్నట్లు చెప్పారు. ఈ బ్లాకులో అవసరమైన మౌలిక సదుపాయా లు, ఎలివేషన్, అత్యాధునిక డిజై న్లతో భవనాన్ని నిర్మించడం జరుగు తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 సీట్ల సామర్థ్యం కలిగిన సమా వేశ మందిరం సమీక్ష సమావేశా ల కు, ఇతర పెద్ద పెద్ద సమావేశాలకు సరిపోవటం లేదని తాను ఆర్ఆర్బీ శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అదనపు బ్లాక్ ను మంజూ రు చేయడం పట్ల ఆమె కృతజ్ఞత లు తెలియజేశారు. నూతన అదన పు బ్లాకు భవన నిర్మాణాన్ని ఎనిమి ది నుండి పది నెలల వ్యవధి లో పూర్తి చేయనున్నామని ఆమె వెల్ల డించారు. అంతకు ముందు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అ ధికారులు శాస్త్రయుక్తంగా పూ జల ను నిర్వహించి అదనపు బ్లాక్ ని ర్మాణ పనులను ప్రారంభించారు

ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్ట ర్ నారాయణ్ అమిత్, స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రా జ్ కుమార్, రోడ్లు ,భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, సూప రింటిండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి ,డిప్యూటీ ఇంజనీర్లు ఫణిజా, గణేష్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అ ధికారి వై. అశోక్ రెడ్డి, జిల్లా పంచా యతీ అధికారి వెంకయ్య, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, ఇత ర అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.