Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Free Bus: మహాలక్ష్మి లో మార్పులు

–ఆధార్ కార్డు స్థానంలో ఆర్టీసీ కొత్త కార్డులు
–సాప్ట్ వేర్ రూపక‌ల్ప‌న‌లో తలము నకలైన టిజిఎస్ ఆర్టీసీ
–ప్ర‌తి ఒక్క‌రూ ఇక ఈ కార్డులపైనే ప్రాయాణించాల్సిందె
–ఆర్టీసీ అన్ని బ‌స్సుల్లో డిజిట‌ల్ పేమెంట్స్ కు శ్రీకారం

Free Bus:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ప్రయాణం (Free bus travel)మరింత సౌకర్యవం తంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆధార్‌ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మహాలక్ష్మీ పథకాన్ని (Mahalakshmi scheme)మరింత సమర్ధవంతంగా సులభతరం చేసేందుకు ఆర్టీసీ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు (Smart cards) పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారుల కు ఈ స్మార్ట్ కార్డులను అందుబా టులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తు న్న బస్ పాస్ మాదిరి గానే ఈ మహాలక్ష్మి పథకంకు (Mahalakshmi scheme) సంబంధించిన స్మార్ట్‌ కార్డులు కూడా జారీ చేస్తారు. వీటిని కూడా మరింత స్మార్ట్‌గా మా ర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నా యి.

ఆర్టీసి లో డిజిట‌ల్ పేమెంట్స్…

ఉచిత ప్రయాణలబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు (Smart cards) ఇవ్వడంతోపాటు చిల్లర సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ పేమెంట్స్ (Digital payments) సిస్టమ్‌ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బండ్ల గూడ డిపోలోని కొన్ని బస్సుల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం విజయ వంతంగా అమలవుతోంది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ పేమెంట్‌ కోసం ఇంటెలిజెం ట్ టికెట్‌ ఇష్యూ మిషన్ పేరుతో ఐటిమ్స్‌ను ప్రవేశ పెట్టింది. బండ్ల గూడలోని బస్సులతోపాటు సుదూ ర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో దీన్ని 3 నెలలుగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రయోగం విజయవంతం కావడంతోపాటు వేరే సమస్యలు రాకపోవడం, చిల్లర బాధలు కూడా తీరడంతో తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నా రు. ప్రయాణికుడి వద్ద నగదు లేక పోయినా కార్డు, ఫోన్‌పే, గూగుల్‌పే (PhonePay, GooglePay)లాంటి పేమెంట్స్ యాప్‌ ద్వారా బస్సులో టికెట్ తీసుకోవచ్చు. దీం తో ఇకపై చిన్న చిన్న చిల్లరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆర్టీసి అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.