–ప్రారంబించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Summer Camp :ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: వేస వికాలంలో పోలీస్ కుటుంబ పిల్లల కు ఆటవిడుపుగా ఉండాలని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో పోలీసు కుటుంబాల పిల్ల లకు సమ్మర్ క్యాంపు నిర్వ హించ డం జరుగుతుందని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ తెలిపారు. ప్రత్యే కంగా చిన్ననాటి నుండి విద్యార్థినీ విద్యార్థులకు వ్యాయామం, ఆటల పై శిక్షణ అందించి ఉన్నత స్థానాల కు ఎదగాలనే సదుద్దేశంతో ఈ స మ్మర్ క్యాంపును ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సమ్మర్ క్యాం పులో మొత్తం దాదాపు 100 మం ది విద్యార్థులకు నెలరోజుల పాటు ఉదయం, సాయంత్ర నిర్వహించే శిక్షణలో భాగంగా విద్యార్థులకు యోగా,కరాటే,వాలీబాల్ లాంటి తదితర క్రీడాంశాలలో నైపుణ్యం కలిగిన పి.ఈ.టి,యోగా గురువుల చేత ప్రత్యేకంగా శిక్షణను అందించ నున్నట్లు తెలిపారు.
ఈ ఆటలు,యోగా వల్ల పిల్లలకు విద్యార్థినీ విద్యార్థులకు మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం లభి స్తుందని తెలిపారు. ఇప్పటి సమా జంలో పిల్లలు చిన్నతనం నుంచే సెల్ ఫోన్ కి అలవాటు పడి ఆటల మీద ఆసక్తి చూపడం లేదని అన్నా రు.ఈ సమ్మర్ క్యాంపు ద్వారా పిల్ల లకు అన్ని రంగాలలో సరైన శిక్షణ అందించడంతో విద్యార్ది దశలో క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్.ఐ లు సూరప్ప నాయుడు, సంతోష్, శ్రీనివాస్,ఆర్.ఎస్.ఐ రాజీవ్,అశోక్,పి.ఈ.టి నాగరాజు, కరాటే మాస్టర్ వంశీ, యోగ మా స్టర్,కిషన్ కుమార్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.