Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Free Training : ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

గురవయ్య

Free Training : ప్రజా దీవేన, కోదాడ:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం కోదాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండల విద్యాధికారి మాగి గురవయ్య మండల సహకార కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోనిస్థానిక MS కళాశాల లో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్,TSRJC శిక్షణ కార్యక్రమమునకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇస్తూ, రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని,వేసవిలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్ TSRJC శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .

అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య గ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు , కోర్స్ డైరెక్టర్ యలమర్తి .శౌరి , కోర్స్ కో ఆర్డినేటర్ గంధం బుచ్చారావు ,పిడమర్తి.వెంకటేశ్వర్లు ,నందిపాటి .సైదులు ,కుడుముల స్వామి దాసు అమరబోయిన వెంకటరత్నం మేళ్లచెరువు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు