Function Hall : ప్రజా దీవెన /కనగల్: మండల పరిధిలో గల కనగల్ ,జి ఎడవెల్లి, తేలకంటి గూడెం, ధర్వేశిపురం పరిసరాలలో ఉన్నటువంటి 20 పైగా ఉన్న ఫంక్షన్ హాల్ లకు, మద్యం మరియు డి జె శబ్దాల వాడకం గురించి నోటీసులు అందజేశారు
ఏ ఫంక్షన్ హాల్ ఓనర్ అయినా మద్యం సేవించుటకు అనుమతి ఇవ్వరాదు. ఒకవేళ పార్టీ పెట్టేటువంటి వ్యక్తి మద్యం సేవించాలని అనుకుంటే సంబంధిత ఎక్సైజ్ శాఖ తప్పనిసరిగా తీసుకొని వస్తే గాని ఫంక్షన్ హాల్ యజమానులు అనుమతించకూడదు. మరియు నిషేధిత డిజె శబ్దాలను వారి యొక్క ఫంక్షన్ హాల్ లో అనుమతించకూడదు. ఇట్టి నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి మద్యం సేవించుటకు మరియు డీజే శబ్దాలను అనుమతిస్తే అట్టి ఫంక్షన్ హాల్ యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును.ఇటీవల జరిగినటువంటి కొన్ని ఫంక్షన్లకు హాజరైనటువంటి వ్యక్తులు మద్యం సేవించి గొడవలకు పాల్పడగా అట్టి వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్ఐ విష్ణుమూర్తి ఫంక్షన్ హాల్ యజమానులకు హెచ్చరించారు