Nalgonda Press Club President : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: తెలం గాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H-143 అనుబంధ నల్ల గొండ జిల్లా ప్రెస్ క్లబ్ నూతన అధ్య క్షునిగా నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షు డు గాలెంక గురుపాదం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలో జరిగిన యూ నియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ స్వల్ప కాలిక సమావేశంలో ఈ మేరకు గు రుపాదం నియామకాన్ని ధృవీకరి స్తూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ ప్రక టించారు.
ఈ సందర్భంగా మాట్లా డుతూ సీనియర్ జర్నలిస్ట్, నాoప ల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అనేక అ నుభవాలతో మునుగోడు నియోజ కవర్గ పరిధితో పాటు జిల్లాలో జర్న లిస్టులతో విస్తృత స్థాయిలో సం బంధాలు కలిగి సేవాభావంతో ముందుకు సాగుతోన్న గురుపాదం ను జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని గా ని యమించడం జరిగింది అని తెలి పారు. నాoపల్లి అధ్యక్షునిగా గురు పాదం అందిస్తోన్న సేవలు మరిoత విస్తృత స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అందించేందుకు ఈ అవకాశం క ల్పించడం జరిగిందని చెప్పారు. మున్ముందు జిల్లా వ్యాప్తంగా పర్య టించి ఆయా ప్రెస్ క్లబ్ ల కార్యకలా పాలు పర్యవేక్షించేందుకు గురుపా దం అనుభవాలు మరింత మెరు గై న రీతిలో వినియోగించుకుంటామ ని యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ పేర్కొ న్నారు. అనంతరం యూనియన్ కార్యనిర్వహక సభ్యుల హర్ష ధ్వా నాల మధ్య ప్రకటించి ఘనంగా స త్కరిస్తూ అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా సభ్యులు గురుపాదంకు పూల మాలలు, శా లువాలతో సత్కరించి శుభాకాం క్షలు తెలియజేశారు. అనంతరం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శు లుగా ఎన్నికైన జయశంకర్, వీర స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నబోయిన మట్టయ్యలను స భ్యులు శాలువాలతో సన్మానించి పరస్పరం మిఠాయిలు పంచుకుం టూ ఆనందోత్స వాల మధ్య సమా వేశాన్ని ముగించారు. ఈ కార్య క్ర మంలో జిల్లా కమిటీ సభ్యులు ల క్ష్మీకాంత్ గౌడ్, వేణు, లక్ష్మీనారా యణ, సతీష్, రాములు, దండం పల్లి రవికుమార్, రాంబాబు, శేఖర్, వరకుప్పల సురేష్ తదితరులు పా ల్గొన్నారు.