— పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటాము
–మందడి సైదిరెడ్డిని పట్టణ ప్రజలు మున్సిపల్ చైర్మన్ గా గుర్తించలేదు
–సీనియర్ నేతలు గుమ్ముల, బుర్రి విమర్శిస్తే గుణపాఠం తప్పదు
Gali nagaraju : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగు తుందని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అన్నారు.
శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ను విమర్శించే స్థాయి లేదన్నారు.
మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మ న్ గా పనిచేసినప్పుడు ఆయనను ఎవరు చైర్మన్ గా గుర్తించలేదని భూపాల్ రెడ్డి డ్రైవర్ గానే గుర్తిం చారని అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించి బీఆర్ఎ స్ పార్టీ నేతలతో మెప్పు పొందా లని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ పార్టీ నేతల ఒక్కొక్కరి చరిత్ర మాకు తెలుసన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేక అధికారం కోల్పోయిన తర్వాత నోటికొచ్చినట్లు మాట్లా డుతున్నారని ధ్వజమెత్తారు. నల్ల గొండలో ఏ అభివృద్ధి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభి వృద్ధి అని స్పష్టం చేశారు. గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రిశ్రీనివాస్ రెడ్డిలు రాజకీయాలలోకి వచ్చినప్పుడు మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేం దర్ లకు రాజకీయ వనమాలు కూ డా తెలవని ఎద్దేవా చేశారు.
అలాంటివారు కూడా మా నాయ కుల గురించి మాట్లాడం సిగ్గుచేట ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగట్టే లింగస్వామి గౌడ్ మాట్లాడుతూ మందడి సైదిరెడ్డి స్థాయిని మించి మాట్లా డుతున్నాడని ధ్వజ మెత్తారు.
ఆయన కాలం కలిసి వచ్చి మున్సి పల్ చైర్మన్ అయ్యాడనీ అన్నారు.
ఆ పార్టీ నాయకులే ఆయనను పలుమార్లు చైర్మన్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధి కారంలో ఉన్నప్పుడు చైర్మన్ గా తీర్మానాలు లేకుండా పనులు చేసి మున్సిపల్ నిధులను దుర్విని యోగం చేశారని ఆరోపించారు.
ఈ విలేకరుల సమావేశంలో యు వజన కాంగ్రెస్ నాయకులు కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్ కు మార్, మహమ్మద్ ముజ్జు, కె.వి. ఆర్ సతీష్, బోరిగం రంజిత్ తదిత రులు పాల్గొన్నారు.