Gandhi Jayanti: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (Office of MLA Camp) మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా కాంగ్రెస్ పార్టి నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో (National Independence Movement) గాంధీజీ పాత్ర కీలకమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. సత్యం, అహింస, ధర్మం అనే మార్గంలోనే చివరివరకు నడిచారని నేటి యువత వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల (Samineni Pramila), కాంగ్రెస్ పార్టి పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,మాజీ సర్పంచ్ పారా సీతయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ,బాల్ రెడ్డి,కౌన్సిలర్లు గుండపునేని నాగేశ్వరరావు,షాబుద్దీన్, గంధం యాదగిరి, సుబ్బారావు ,నిరంజన్ రెడ్డి, బషీర్, బాగ్దాద్ ,పాలూరి సత్యనారాయణ, కంపాటి శ్రీను, సైదా నాయక్,ఎస్ ధని,పిడతల. శ్రీను తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.