–భూపాలపల్లిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Gandra Satyanarayana Rao: ప్రజా దీవెన, భూపాలపల్లి: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తిని నింపారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao)అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపా లపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రజక సంఘం వారి ఆధ్వ ర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడు కల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొ న్నారు. అనంతరం అక్కడ ఏర్పా టుచేసిన చాకలి ఐలమ్మ చిత్రపటా నికి పూలమాలవేసి ఘన నివాళు లర్పించారు.
అనంతరం భూపాల పల్లి కలెక్టరేట్లోని ఐడిఓసి కాన్ఫరె న్స్ హాల్లో (IDOC Conference Hall)జిల్లా వెనుకబడిన తరగ తుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరా వు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శనీ యురాలని కొనియాడారు. వారు ఆనాడు చేసిన ఉద్యమమే తెలం గాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మళ్లీ దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్యే (mla)గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్ ముఖ్ లు, ప్రజా కార్ల గుండెల్లో దడపుట్టించాయని అ న్నారు. ఒకవైపు సాయిధ పోరాటం చేస్తూనే, మరోవైపు ఉద్యమకారు లకు అమలు అన్నం పెట్టిన మహ నీయురాలు అని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి (Chakali Ailamma Jayanti) వేడుకలను ఈనె ల 26న రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించ బోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.