–మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి
Ganesh celebrations: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు (Ganesh celebration)జరుపుకోవాలని మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్ రెడ్డి (Srinivas Reddy) కోరారు. ఆదివారం విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గణేశ్ భవన్ లో నిర్వ హించిన వినాయక చవితి ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం ఉండరాదని, ప్రజలకు ఇబ్బందులు కల్పించకుం డా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం డిసెంబర్ 3 నాడే మీకు వచ్చిందని, గ్రూపులు, వర్గాలు చేయరాదని ఆయన సూచించారు.
ఐక్యమత్యం తో సామరస్యంగా ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిష్టతో నియమాలతో గణేష్ మండ పాలలో(Ganesh mandapam) పవిత్రం గా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు చేయ కుండా మంచి సంకల్పం తో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ నంబరు కోసం వచ్చిన వారికి ఏదైనా ఒక కట్టుబాట్లు చేయాలి అని విశ్వహిందూ పరిషత్ సభ్యు లను కోరారు. అందరం ఇక్కడే పుట్టాం ఈ మట్టిలోనే (mud)కలిసిపోయే వాళ్ళం కాబట్టి కుల మతాలకు అతీతంగా కలిసి కట్టుగా పండుగ లు, పర్వదినాలు జరుపుకోవాలని ఆయన యువతను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మద్ది యాదిరెడ్డి, లక్ష్మణ్ యాదవ్, సుధాకర్ రెడ్డి, గోపాల్ యాదవ్ , అబ్దుల్ హక్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.