Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ganesh Navratri celebrations: మేళ తాళాలతో వైభవోపేతంగా గణనాధుని శోభాయాత్ర.

ప్రజా దీవెన,కోదాడ:గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri celebrations) సందర్భంగా పట్టణంలోని భవాని నగర్ లో మిడియాల భారత్ రెడ్డి వీధి నందు భవాని నగర్ బాయ్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని మండపం (Mandapam of Lord Ganesha) వద్ద ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలతో ప్రసాదాలతో ఘనంగా తొమ్మిది రోజులు పూజించి సోమవారం శోభాయాత్రకు బయలుదేరారు.

పట్టణ పురవీధులలో బాణాసంచి బ్యాండ్ మేళాలతో మహిళల చిన్నారులు నృత్యాలతో (Women’s children with dances) వైభవోపేతంగా శోభాయాత్రను నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి దాత కృష్ణారెడ్డి సహకరించడం అభినందనీయమని భవాని నగర్ బాయ్స్ ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీసభ్యులు,మహిళలు,పెద్దలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు శోభాయాత్రలో మహిళలు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురని ఆకట్టుకున్నాయి.