నాగర్‌కర్నూల్ లో దారుణo, యు వతిపై సామూహిక లైంగికదాడి
Gangrape: ప్రజా దీవెన, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండ లంలో దారుణం చోటుచేసు కున్న ది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారా నికి పాల్పడ్డారు. మహ బూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఊరుకొండపేట ఆంజ నేయ స్వామి ఆల యంలో మొక్కులు తీర్చుకోవ డానికి శనివారం సాయంత్రం వ lచ్చారు. దర్శనం అనంతరం రాత్రి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో యువతి కాలకృత్యా ల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా, అక్కడ మాటువేసిన యు వకులు ఆమెను అడ్డుకున్నారు. యువతి బంధువుపై దాడిచేసి చే తులు కట్టేశారు. ఆమెను బల వం తంగా సమీపంలోని గుట్ట ప్రాం తం లోకి తీసుకెళ్లి సామూహిక లైం గిక దాడి చేశారు.
అనంతరం అక్కడి నుంచి పరార య్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. నిందితులను ఊరుకొండ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు. వారిలో ఆ రుగురిని అదుపులోకి తీసుకున్నా రు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తు న్నారు.