Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ganja Trafficking: గంజాయి వయా ఒడిశా

–జోరుగా గంజాయి అక్రమ రవాణా
–మత్తులో జోగుతున్న యువత

Ganja Trafficking: ప్రజాదీవెన, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో (Sangareddy) గంజాయి అక్రమ రవాణా (Trafficking) కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయికి అలవాటుపడ్డ యువత తప్పుదోవ పడుతుంది. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితం మాత్రం ఉండడం లేదు. గంజాయి రవాణా చేసే వారు వివిధ మార్గాల్లో పోలీసుల కన్నుగప్పి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ (Narayankhed) గంజాయి సాగు పెట్టింది పేరు. గతంలో ఇక్కడ గంజాయిని పెద్దఎత్తున్న సాగు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం (telangana state) వచ్చిన తర్వాత ఎక్సైజ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ప్రత్యేక చర్యలతో నారాయణఖేడ్‎లో గంజాయి సాగును చాలా కట్టడి చేశారు.

జిల్లాలో ఒకప్పుడు గంజాయి సాగుకు తీవ్రంగా ఉండేది. క్రమేణ సాగు తగ్గినప్పటికీ అక్రమార్కులు రవాణా మాత్రం ఆగడంలేదు. ఇక జహీరాబాద్‌ పరిధిలోని సరిహద్దు చెక్‌పోస్టు (checkpost) వద్ద నిఘా పెంచడంతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గంజాయి అక్రమ రవాణాకు కూడా కొంతమేర అడ్డుకట్ట పడింది. దీంతో వ్యాపారులు కొత్త దారులు వెతుకున్నారు. ఇప్పుడు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి ఏజెంట్ల (ganja agents) ద్వారా గుట్టుగా దందా కొనసాగుస్తున్నారు వ్యాపారులు. గతంలో గంజాయి దందా చేసిన వారు కొందరు ఏజెంట్లను నియమించుకుని రైలు, లారీల్లో ఎండు గంజాయిని ఇతరత్రా వస్తువులున్న బ్యాగుల్లో తెప్పిస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డిలో కొందరు ఏజెంట్లతో అమ్మకాలు సాగిస్తున్నారు.1000 రూపాయల నుంచి రెండు వేల వరకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి తెప్పిస్తున్న వ్యాపారులు సంగారెడ్డిలోని ఏజెంట్లకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.

ముఖ్యంగా ఎండుగంజాయిలో నాణ్యమైన శీలావతి రకంను రూ.10 నుంచి రూ.15 వేలకు కిలో చొప్పున అమ్ముతున్నట్టు సమాచారం. ఆయా ఏజెంట్లు తాము కొనుగోలు చేసిన ధరకు రెట్టింపుగా నిర్ణయించి, 50 గ్రాముల చొప్పున చిన్నచిన్న పాకెట్లను చేసి అమ్ముతున్నారు. పట్టణంలోని పాత, కొత్త ఏరియాల్లోని కొన్ని చిన్నచిన్న కిరాణషాపుల్లో (grocery stores)గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఏజెంట్లకు కొందరు పోలీసులు సహకారం అందిస్తున్నట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి, సదశివపేట, జహీరాబాద్, నర్సపూర్ లాంటి ప్రాంతాల్లో ఈ గంజాయిని ఎక్కువగా అమ్ముతాన్నారు. ఈ గంజాయి అమ్మకంలో ఎక్కువగా మహిళలు, పిల్లలను వాడుతున్నారు వ్యాపారులు. మహిళలకు డబ్బు ఆశ చూపి వారితో చిన్నచిన్న కవర్లలో పెట్టి అమ్ముతున్నారు. మహిళలపై ఎవరికి అనుమానం రాదు అని ఇలా ఈ వ్యాపారంలోకి దింపుతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న పోలీసులు (police) ఇవన్నీ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పోలీసులు ఎప్పుడైనా సోదాలు నిర్వహిస్తే దొరకకుండా ఉండేందుకు ఏజెంట్లు గంజాయి ప్యాకెట్లను తమ ఇళ్లలోని చెట్ల పొదలలో, నీటి కుళాయి గుంతల్లో దాచిపెడుతున్నట్టు తెలిసింది. మరో వైపు ఈ గంజాయి వాడకంకు యువత బానిసలవుతున్నారు. సంగారెడ్డి చుట్టు పక్కల ఉన్న విద్యాసంస్థల విద్యార్థులు చాలా వరకు సంగారెడ్డిలో (sangareddy) నివాసముంటారు. వారిలో కొందరితో పాటు పట్టణంలో సిగరెట్‌ అలవాటు ఉన్న యువకులు, కొందరు గంజాయి తీసుకుంటున్నారు. ఒకసారి గంజాయికి అలవాటు పడ్డవారు మత్తుకులోనై బానిసలవుతున్నారు. ఒక్కరోజు దొరకకపోతే వారి వ్యవహరశైలిలో మార్పు కనిపిస్తున్నది.