Gas Cylinder Blost : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండలోని ఓ బిర్యాని సెంట ర్‌లో పేలుడు కలకలం సృష్టించిం ది. మంగళవారం తెల్లవారుజాము హైదరాబాద్ రోడ్డులోని పూజిత అ పార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి షెటర్ గేటుతోసహా లోపల ఉన్న సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచే సుకోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేశారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. అయితే గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.రంజాన్ మాసం సంద ర్భంగా అర్ధరాత్రి వరకు షాప్ తెరిచే ఉన్నదని, షాప్ బంద్‌చేసిన 15 ని మిషాలకు ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ సిలిం డర్ అయితే ఏమీ పేలలేదని, మరే దైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gas cylinder blost at nalgonda pic.twitter.com/xjfEU4okHX
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 25, 2025