–లోతట్టు ప్రాంతాలకు జీహెచ్ఎంసీ కీలక సూచన
GHMC Alert: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (rains)కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మహా నగరంలో ముసురు ముంచేస్తోంది. అక్కడక్కడ భారీ వర్షాలు (heavy rains)కుర వడంతో హుస్సేన్ సాగర్ నీటి మ ట్టం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీం తో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ (ghmc)అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని రం గంలోకి దింపారు. అదేవిధంగా నగరంలోని పలు చోట్ల నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో తొలగించే పనిలో పడ్డారు. అయితే, హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 514.75 మీ టర్లుగా కాగా, ప్రస్తుత వరద నీరు ఇన్‌ఫ్లోతో (Flood water inflow) నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. రంగంలోకి దిగిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi), కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించి లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఉన్న తాధికారులు ఆదేశలు జారీ చేశా రు. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో సిటీలో 8.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు వర్షపు నీరు చేరడంతో అక్కడక్కడా భాగా ట్రాఫిక్ (traffic) అయింది.