GHMC : ప్రజా దీవెన, హైదరాబాద్: అక్రమ సంబంధంతో ప్రారంభమై మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకు న్న జీహెచ్ఎంసీ అధికారిని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జీహెచ్ఎంసీ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పని చేస్తున్న జానకి రామ్ అనే ఉన్నతాధికారి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య కల్యాణికి అనుమానం రావడంతో నిఘా పెట్టింది. ఈ క్రమంలో తనకన్నా 20 ఏళ్లు తక్కువ వయసు ఉన్న అ మ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ సికింద్రాబాద్ వా రాసిగూడలో ఉంటున్నట్లు గుర్తించి తగిన శాస్తి చేయాల్సిందేనని నిర్ణయించుకొని తాజాగా ఆ అ మ్మాయితో జానకిరామ్ ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలన్న పక్క ప్లాన్ అమలు చేసింది.
దీంతో శుక్రవారం కల్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతా కలిసి జానకిరామ్ తో పాటు సదరు యువతిని పట్టుకొని దేహ శుద్ధి చేశారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘ టనపై వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Ghmc jointcommissioner illigal contact pic.twitter.com/IP1hftDuFE
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 21, 2025