Giridhar IPS :ప్రజా దీవెన, వనపర్తి: ఆన్లైన్ మోసాల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేస్తుంది. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్ళు రోజు,రోజుకి కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడి గాచేసుకోనేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయో గిస్తున్నా రని, మోసపూరిత వాగ్దానాలు, ప్రక టనలతో మోసాలకు పాల్పడుతు న్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీ ముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రజలకు సూచించారు.గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయి . నిత్య సరుకులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ మొదలగు వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేసే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ క్రింద ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దు అని జిల్లా ఎస్పీ అన్నారు. ఇలాంటి మల్టీలెవల్ వ్యాపారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు సేకరించి ఆర్దికంగా మోసం చేసిన విషమై పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులను చైతన్య పరిచి ఫిర్యాదులు తీసుకుని జిల్లాలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ గుర్తుచేశారు. చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎక్కువమంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నారు.
సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతారు భారీ లాభాలు తోపాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వలపన్నుతారని ఎస్పీ తెలిపారు.
అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలి, లేదంటే ప్రజల్ని మాయలోకి దింపి డబ్బులు కొల్లగొడతారు, అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం. గొలుసుకట్టు మార్కెటింగ్ లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయి ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందే. ఇలాంటి నెట్వర్క్ లో ఎవరు చేరొద్దు ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరు వెళ్ళవద్దు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, వాట్సప్ నెంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయండి అని ఎస్పీ తెలిపారు.
వనపర్తి జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ ఎన్ బి, రత్నం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులు వెంటనే పోలీస్టేషన్ లలో సైబర్ వారియర్స్ ను కలిసేలా చేసి సంబంధిత బ్యాంకు వారితో మాట్లాడి అమాంట్ ను హోల్డింగ్ చేపించడం,గ్రామాలలో సైబర్ వారియర్స్ ద్వారా ప్రజలకు అవగాహనా కల్పించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.