GN Saibaba: ప్రజా దీవెన, కోదాడ:జన చైతన్య వేదిక పూర్వ (Jana Chaitanya Vedika Purva)ప్రస్తుత పిడిఎస్యు నాయకులు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మండల సహకారం కళాశాలలో ప్రపంచ మేధావి పౌరహక్కుల నాయకులు జి ఎన్ సాయిబాబా (GN Saibaba) సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా జనచైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు (Jana Chaitanya Vedika Convenor Rayapudi Venkateswara Rao)(చిన్ని) కో కన్వీనర్ బంగారు నాగమణి మాట్లాడుతూ రాజ్య హింసకు వ్యతిరేకంగా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన సాయిబాబా చేయని నేరానికి 10 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్షణ అనుభవించారు 90 శాతం అంగవైకల్యం ఒకవైపు మరోవైపు అనారోగ్య సమస్యలు (Health problems) వెంటాడుతున్న సమాజ మార్పు కోసం రాజ్యహింసకు గురైన ప్రజల న్యాయం కోసం జరిగిన పోరాటంలో పాల్గొని అండగా నిలిచారని గుర్తు చేశారు.తొలుత సాయిబాబా చిత్రపటానికి పూల మాసం వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, విజయకుమార్,, రాపర్తి రామ నరసయ్య, బడుగుల సైదులు, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, రాయపూడి వెంకటనారాయణ, నారపు రాజు హరికిషన్ రావు ,ఎస్కే మస్తాన్ అధ్యాపకులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.