నాంపల్లి మండలం తాసిల్దార్ గోగులోతు దేవ సింగ్
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న 20 24 క్రిస్మస్ వేడుకలను నాంపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నాంపల్లి మండల తహసిల్దార్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ సందేశకులు వర కుమార్ దైవ ప్రార్థనలు చేశారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి హాజరై క్రీస్తు జననం ప్రపంచానికి క్రీస్తు శకంగా రాయబడిందని క్రిస్టియన్లు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరారు.
మండల తాసిల్దార్ దేవ్ సింగ్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని నూతన సంవత్సరానికి పునాది వేయాలని క్రిస్టియన్లు తమ పిల్లలను మంచిగా చదివించాలని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మేరి స్వర్ణకుమారి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాలింక గురుపాదం మండల పాస్టర్స్ అధ్యక్షులు పి సాల్వా న్ అనన్య పాల్రాజ్ పేతురు గిరి ప్రసాద్ మీ మార్క్ ఎన్ డేవిడ్ రాజ్ కె ఏలియా జి మై మా నాంపల్లి మండల కేంద్రంలోని క్రీస్తు నమ్మకస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ విందులో పాల్గొని ఆనందపడ్డారు