మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 19 ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో పోరాటాలు ఆగవని మాల మహానాడు నాంపల్లి మండల శాఖ అధ్యక్షులు గొల్లబోయిన వెంకటయ్య అన్నారు. గురువారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా ప్రజా దీవెనతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా నేడు రాష్ట్ర కమిటీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న మాల మహానాడు నాయకులను ఉదయం 5 గంటలకు నాంపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి మా ఉద్యమాన్ని నిలిపారని చెప్పారు.
ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని మా నాయకులని మా పోరాటాలని నేరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని మా చివరి శ్వాస వరకు పోరాటాలు సాగిస్తామని మా ఎస్సీ వర్గీకరణ సాధించి న్యాయ పరంగా హక్కులు పొందుతామని అన్నారు అరెస్టు అయిన వారిలో మండల మహానాడు ఉపాధ్యక్షులు సల్వాది దేవయ్య బీదర్ శేఖర్ గిరి స్వామి , కోరే కేశవులు గంటే ల వెంకటయ్య పెరుమాళ్ళ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు