అదృష్టం.. అంతలోనే దురదృష్టం..!
ప్రజా దీవెన/ అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది అని ఊపిరి పీల్చుకునే లోపే దురదృష్టం వెంటాడింది. ఇదేదో అదృష్టమంటే లాటరీ తగిలిందని… దురదృష్టమంటే వచ్చిన లాటరీ చేజారిందని కాదు సుమా. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుటుంబ కలహాల కారణంగా భార్యా భర్త లు గొడవపడి ప్రానాలమీదకు తెచ్చుకున్నారు.
భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి విద్యుత్ స్థంభం ఎగబాకి ఏకంగా విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. అదృష్టం బాగుండి అప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో షాక్‌కు గురవ్వక పోవడంతో అంతా ఊపిరపీల్చుకున్నారు. అంతలోనే అదృష్టం వెక్కిరించి దురదృష్టం వైపు మళ్ళిoచడంతో విద్యుత్ తీగల నుంచి పట్టు కోల్పోయి అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతని తలకు బలమైన గాయo కాగా ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు.