సైనికులత్యాగాలుచిరస్మరణీయ.
మధుసూదన్ చౌదరి…….
Gopaiya Chari: భారత్, పాకిస్తాన్ కు ( India , pakistan)మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం వెటరన్ గోపయ్య చారి చేసిన త్యాగం చిరస్మరణీయమని ఐ వి ఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన చౌదరి పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్య చారి 25వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి అమరవీరుడు గోపయ్య చారి (Gopaiya Chari) సతీమణి వీరనారి శారదా, కూతురు మౌనిక తో కలిసి చౌదరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. గోపయ్య చారి gopaiya chari)కార్గిల్ యుద్ధంలో శత్రువులతో భీకరంగా పోరాడి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని తెలిపారు..ఈ కార్యక్రమంలో గుండ్లపనేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్ వెటరన్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ రావు,ట్రెజరర్ వెంకన్న, పిఆర్వో శేకు. రమేష్, యూత్ వింగ్ సభ్యులు లక్ష్మీనారాయణ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.