Bonus: రైతు పండించిన పంటలన్నిటికి ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిందే
తెలంగాణ రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.
డబ్బాలో ఓట్లు పడ్డాక చావు కబురు చల్లగా చెబుతున్నారు
బోనస్ అన్నింటికీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
సిద్దిపేట జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన సంధర్బంగా మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణ రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్(Bonus) ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు. డబ్బాలో ఓట్లు పడి, సీల్ పడ్డాక రైతులకు చావు కబురు చల్ల గా చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala nageshwar rao) అవగాహన లేకుండా మాట్లాడు తున్నారని ద్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో బుధవారం వడ్ల కొనుగో లు కేంద్రాన్ని సందర్శించిన సంధ ర్బంగా ఆయన మాట్లాడారు.
రైతు లతో హరీశ్‌రావు(Harish rao) మాట్లాడి వారికి అండగా ఉంటానని భరోసా కల్పిం చారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తాము సన్నరకాలకే బోనస్ ఇస్తామని దొడ్డు వడ్లకు ఇవ్వ మని ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావ డానికి బాండ్ పేపర్ మీద 6 గ్యారెం టీలను రాసిన విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు బోనస్ ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోనస్ విషయంలో ఆలో చించి సన్నవడ్లకే కాకుండా దోడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించా రు. కాంగ్రెస్ నాయకులను రైతులు గ్రామాల్లో నిలదీస్తారని అన్నారు.
తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతి పదికన కొనాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.తుఫాన్ ప్రభా వంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొన కపోవడం వల్ల వడ్లు తడిచే అవకా శం ఉందని ఆందోళన వ్యక్తం చేశా రు.ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగా పులు కావలసిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభు త్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని, చిన్నకో డూరు కేంద్రాల్లో రైతులు 20 రోజు లుగా వేచి చూస్తున్నారన్నారు.
ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తిందని, ధాన్యం(Crop) రైస్ మిల్లు కు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదని,కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోత పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని విచారం వ్యక్తం చేశారు. తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిచిన, మొలకెత్తిన వడ్లను కూడా కొనాలని, 40% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని, లారీల సంఖ్య పెంచి ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నామన్నారు.
Government give bonus for all crops