రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానా లను (Promises) అమలు చే యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగా ర్జున ( paladugu nagarjuna) డిమాండ్ చేశారు. ఆదివారం రోజున సిపిఎం నల్గొండ మండలం కమిటీ సమా వేశం దొండ కృష్ణా రెడ్డి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవ నంలో జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారం టీలు ఇచ్చి అమలు చేయ డంలో విఫలము చెందుతుందని అన్నారు. ఉచిత బస్సు ( free bus) మినహా ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి నెలకొన్న దని తెలియజే శారు. కనీసం రేషన్ కార్డులు ( rati on cards) పెన్ష న్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చే పరి స్థితి లేదన్నారు.
కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలే పరిస్థితి ఉందని అన్నారెడ్డి గూడెం అప్పా జీపేటలో వెంటనే పంపిణీ చేయా లని డిమాండ్ చేశారు. మహిళల కు ఇచ్చిన వాగ్దానాలైనా ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ ( slbc ) సొరంగ మార్గాన్ని పూర్తిచేసి నల్గొం డ మండలంలో పిల్ల కాలువల ద్వా రా ప్రతి ఎకరానికి నీరు అందించా లని డిమాండ్ చేశారు.
చందన పల్లి గ్రామానికి దగ్గరలా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ ( dum ping yaard) వెంటనే తొలగించా లని కోరారు. ఎన్నికలలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి తొలగిస్తామని వాగ్దానం చేశా రని, కానీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదని తెలియజేశారు. దీనివలన రామారం చందనపల్లి పానగల్లు సూరారం రామారం గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురైన పరిస్థితి ఉందన్నారు.
కుక్కలు, దోమలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రాలు ( ikp centers) ప్రారంభించారు కానీ గింజ ఒడ్లు కొనే పరిస్థితి లేదన్నా రు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని తెలి యజేశారు. మండ లంలో లింకు రోడ్లను పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాల డుగు ప్రభావతి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ సిపిఎం మండల కార్యదర్శి నలుపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు దొండ కృష్ణారెడ్డి, కొండ వెంకన్న, పోలే సత్యనారాయణ, లింగస్వామి, కోట్ల అశోక రెడ్డి,బొల్లు రవీందరు, మానుపాటి ఎల్లయ్య, కుడతల భూపాలు, కండే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Government promisese