Engineering Fee Regulation : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాల ల్లో ఫీజుల నిర్ణయంపై హేతుబద్ధమై న నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వం యోచిస్తోంది. ఆయా కళా శాలల్లో బోధన సిబ్బంది, బోధన స్థా యి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనా లు ఇతర వసతులు ఇలా ప్రతిఒక్క అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించి తద నుగుణంగా నిర్ణయాలు తీసుకోవా లనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉం ది. కృత్రిమ మేధ (ఏఐ) వంటి కో ర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశా లలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి భావిస్తున్నా రు.
మారుతున్న మార్కెట్ అవసరాల కు తగినట్లు కళాశాలలు ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ ప్ర ణాళికబద్ధంగా ముందుకువెళ్లేలా వ్యవస్థను రూపొందించాలని ప్రభు త్వం యోచిస్తోంది. ఈ క్రమంలో రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ క ళాశాలల్లో మెరుగైన వసతులు, బో ధన సిబ్బంది, ల్యాబ్‌లు, ఏఐసీటీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఫీజుల ని ర్ణయానికి వీటినే ప్రాతిపదిక తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేష న్ వర్సెస్ కర్ణాటక, పీఏ ఇనాందార్ అండ్ అదర్స్ వర్సెస్ మహారాష్ట్ర కే సుల్లో ఆయా కళాశాలల్లోని వస తులు, ల్యాబ్‌లు, లెక్చరర్లకు ఆ సం స్థ ఇచ్చే వేతనాలు, బోధన, బోధ నేతర సిబ్బంది, కళాశాల భవిష్యత్ ప్రణాళికలు, కళాశాల ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న నిర్ణయా లను ప్రతిపాదిక చేసుకోవాలని సు ప్రీంకోర్టు పేర్కొంది. ఫీజుల నిర్ణయం లో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణ నలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.
ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, బోధన సి బ్బంది, ఇతర వ్యవహారా లపై గత ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ శాఖతో తనిఖీలు చే యించింది. ఆ శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి నివేదిక రూపొందిం చింది. కానీ గత ప్రభుత్వం ఆనివే దికపై ఎటువంటి చర్య తీసుకోలే దు. కానీ తమకు నచ్చిన కళాశాల లకు ఫీజులు పెంచుకునే అవకాశా న్ని కల్పించి మరికొన్ని కళాశాలలకు మాత్రం పక్షపాత వైఖరితో మొండి చేయి చూపింది. ఈ నేపథ్యంలో ప్ర స్తుతం ఆ నివేదిక పరిశీలనతో పా టు ఇంజినీరింగ్ కళాశాలల్లో అందు తున్న విద్యా ప్రమాణాలను మదిం పు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకు నేందుకు ఒక కమిటీని నియమించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. అదే సమ యంలో ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధిం చిన కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీ ట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల
కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల భ ర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొట్టమొదటి సారి జోసా పద్ధతిలోనే టీజీఈఏపీ లోనూ మాక్ కౌన్సిలింగ్ ని నిర్వ హించారు. ఈ పద్ధతిలో ఎంపిక చే సుకున్న కళాశాలల నుంచి మొదటి సీట్లను కేటాయించనున్నారు. వి ద్యార్థులు వెబ్ ఆప్షన్ల లో ఎలాంటి మార్పు చేసుకోక పోతే మాక్ కౌన్సి లింగ్లో కేటాయించిన సీట్లనే ఫైనల్ చేయనున్నారు. మొత్తం 3 ఫేజ్లలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల కౌ న్సిలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి విడత .. మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 28 నుంచి జులై 7వ తేదీ వర కు ఆన్లైన్ స్లాట్ బుక్కింగ్ కు అవకా శం కల్పించనున్నారు జులై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్లాట్ బుకిం గ్ , 6వ తేదీ నుంచి 10వ తేదీ వర కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తా రు. జులై 13వ తేదీ లోపు మాక్ కౌ న్సిలింగ్ సీట్ల కేటాయింపు చేయను న్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో మార్పు లేకపోతే అవే సీట్ల కేటా యింపును ఫైనల్ చేయనున్నారు. జులై 18వ తేదీలోపు మొదటి విడ త కౌన్సిలింగ్ సీట్లను కేటాయించ నున్నారు.
రెండో విడత : జులై 25న రెండో ఫేజ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం క ల్పించి 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 26,27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీక రించనున్నారు. జులై 30వ తేదీలో పు సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు చే యనున్నారు. రెండో విడత కౌన్సి లింగ్ తర్వాత విద్యార్థులు జులై 31 నుంచి ఆగస్టు 2వ తేదీల్లోపు తమ కు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తి గతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుం ది. అన్ని కళాశాలల నుంచి విద్యా ర్థుల జాయినింగ్ సమాచారం తీసు కుని మిగతా సీట్లకు ఆగస్టు 5 నుం చి స్లాట్ బుక్కింగ్ చేపట్టనున్నట్టు టీజీఈఏపీసెట్ అడ్మిషన్స్ కమిటీ ప్రకటించింది.
మూడో విడత ఆగస్టు 5న మూడో విడత కౌన్సిలింగ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం ఇచ్చి 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 10వ తేదీలోపు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. మూ డు విడతల కౌన్సిలింగ్ పూర్తైన త ర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకా శం కల్పించనున్నట్టు అడ్మిషన్స్ క మిటీ పేర్కొంది. ఇంటర్నల్ స్లైడింగ్కి ఆగస్టు 18,19 తేదీల్లో ఆప్షన్లను తీ సుకుని ఆగస్టు 22వ తేదీలోపు సీ ట్లకేటాయింపును పూర్తి చేయనుం ది.