–నేటి నుంచి మూడు రోజుల జిల్లాల పర్యటన
Governor Jishnudev Verma: ప్రజా దీవెన, యాదాద్రి: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnudev Verma) నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల పర్య టన చేయనున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnudev Verma) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ని దర్శిం చుకున్నారు. ఆలయానికి చేరుకు న్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌ను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసా దాలు అందజేశారు. అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వి భాగాన్ని గవర్నర్ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేప ట్టిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ యాదా ద్రికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ( Jishnudev Verma) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర సింహస్వామి వారిని దర్శించు కున్నారు.అనంతరం దర్శన ఏర్పా ట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్న ర్ జిష్ణుదేవ్‌వర్మ (Jishnudev Verma) నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదా శీర్వచనం అందించగా, అధికారు లు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు.కాగా, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్న ఆ యన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు ములుగు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు.మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టరేట్ సమావేశ మంది రంలో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచ యితలు, కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గం టలకు వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం సరస్సును సందర్శించనున్నారు.అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను సంద ర్శించి పూజలు చేస్తారు.
సాయం త్రం 6.30 గంటలకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సా పురంలోని లక్నవరం సరస్సు వద్ద కు చేరుకొని హరిత రిసార్ట్‌లో ఇతర అధికారులతో కలిసి రాత్రి బస చేయనున్నారు.బుధవారం ఉద యం 8 గంటలకు లక్నవరం నుంచి హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29న మధ్యా హ్నం 2.20 గంటలకు ఆలేరు మం డలంలోని కొలనుపాక జైన దేవాల యాన్ని, సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు భువనగిరి కలెక్టరేట్‌లో రచయితలు, కళాకారులు, ప్రము ఖులు, రాష్ట్ర జాతీయ అవార్డు (National Award) గ్రహీతలను కలుస్తారు.