Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati reddy venkat reddy: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలు విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలు విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి(Minister of Roads and Buildings and Cinematography Komati Reddy Venkata Reddy ) అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మం డలం బ్రాహ్మణ వెల్లేముల జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థులకు యూని ఫామ్స్, పుస్తకాల ను పంపిణీ చేశారు.చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలం దరినీ బడికి పంపించాలని కోరారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం ద్వారా నాణ్య మైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నల్గొండ జిల్లాకు 50 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని అన్నారు. పాఠశాలల్లో పనులతో పాటు, విద్యార్థులకు యూనిఫార్మ్స్ ను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే 13000 కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెళ్లెముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులతో పాటు, డైనింగ్ హాల్, టాయిలెట్లను 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లేములకు త్వరలోనే ఒక్కోటి ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు కట్టిస్తామని, 70 కోట్ల రూపాయల తో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టులో (Brahmana Vellemla project)మూడు నెలల్లో నీళ్లు నిప్పి డిసెంబర్ లోపు పూర్తి చేసి సాగునీటి అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.

నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం(MLA Vemula Veeresham ) మాట్లా డుతూ, బ్రాహ్మణ వెల్లేముల పాఠశాలను జిల్లాలో రోల్ మోడల్ గా తీర్చిది ద్దుతామని, చదువుకుం టేనే కుటుంబాలు బాగుపడతా యని, మంత్రి కోమటిరెడ్డి ఆశయా ల కనుగుణంగా తీర్చిదిద్దు తామని, నియో జకవర్గం లోని 50 పాఠశా లలను పట్టిష్ట పరిచేందుకు, అలాగే విలువలతో కూడిన విద్యను అందిం చేందుకు కృషి చేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ పాఠశాలలను మహార్దశకు తీసుకువచ్చే అవకాశం వచ్చిందని, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, రెండు మూడు రోజుల్లో జిల్లాలో అన్ని పనులను పూర్తి చేస్తామని, అమ్మ ఆదర్శ కమిటీల(Amma Adarsha ​​Committee) లో ఉన్న మహిళా సంఘాల ద్వారా విద్యార్థుల తులను పుట్టించడం జరిగిందన్నారు.

అలాగే పాఠశాల పనులలో అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతానికి భిన్నంగా పాఠశాలలు పున ప్రారంభం కాగానే యూనిఫామ్స్ తో పాటు, పుస్తకాలు ఇస్తున్నామని, రెండవ జత యూనిఫామ్ 10 రోజుల్లో ఇస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ,డీఈవో బిక్షపతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అంతేకాక టాయిలెట్స్ ను తనిఖీ చేశారు.

Govt school education equal to private school education