–నాగార్జున సాగర్ తీరం అందాల అంచున బుద్ధవనం
–మహాస్థూపం వద్ద ఫోటోలు దిగిన సుందరీమణులు
–బుద్ధుని మహా పాదాలకు పూలతో పూజలు
–మహా స్థూపం లో జ్యోతి ప్రజ్వలన, ధ్యానంలో పాల్గొన్న సుందరీమణులు
— ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.ఎస్పి శరత్ చంద్ర పవార్
–హాజరైన ఎంఎల్ఏ లు కుందూరు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్మారెడ్డి, ఎం ఎల్ సి శంకర్ నాయక్
Buddhavanam Sculptures : ప్రజాదీవెన నల్గొండ :తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణుల బృందం సోమవారం నల్గొండ జిల్లా బుద్ధ వనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది. ముందుగా సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్ లో ఫోటోలు దిగారు.
అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహా స్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానం లో పాల్గొన్నారు. మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలికారు.
బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు.అనంతరం జాతకవనంలో బుద్ధ చరితం పై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్ పి శరత్ చంద్ర పవార్, ఎంఎల్ఏ లు కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్మారెడ్డి,బాలునాయక్, ఎంఎల్సి శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ బుద్ధవనం, నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను, తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు. ఐఏఎస్ అధికారి లక్మి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పి లు రమేష్, మౌనిక, ఆర్ డి వోలు, జిల్లా అధికారులు, తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.